MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • CSK vs MI: సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌ చేసిన ముంబై !

CSK vs MI: సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌ చేసిన ముంబై !

CSK vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో మార్చి 23న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ను ఆడనుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 19 2025, 11:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Suryakumar Yadav Captains Mumbai Indians vs CSK IPL 2025

Suryakumar Yadav Captains Mumbai Indians vs CSK IPL 2025

Mumbai Indians: భారత టీ20I జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో 2025 లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) ప్రారంభ మ్యాచ్‌లో ఆ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా లేకపోవడంతో 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ ముంబై జట్టును నడిపిస్తాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Suryakumar Yadav Captains Mumbai Indians vs CSK IPL 2025

Suryakumar Yadav Captains Mumbai Indians vs CSK IPL 2025

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఐపీఎల్ 2024 మ్యాచ్‌లో నెమ్మదిగా బౌలింగ్ (స్లో ఓవర్ రేట్)  చేసినందుకు హార్దిక్‌ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. 31 ఏళ్ల హార్దిక్ పాండ్యాకు ఒక మ్యాచ్ నిషేధం, రూ. 30 లక్షల జరిమానా విధించడం ఇది మూడోసారి.

35
Suryakumar Yadav Captains Mumbai Indians vs CSK IPL 2025

Suryakumar Yadav Captains Mumbai Indians vs CSK IPL 2025

ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. చివరి ఓవర్ దాదాపు రెండు నిమిషాలు ఆలస్యంగా వేశారని తనకు తెలుసునని చెప్పాడు. కొన్నిసార్లు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడం తన చేతుల్లో లేదని కూడా అన్నాడు.

45
Suryakumar Yadav Captains Mumbai Indians vs CSK IPL 2025

Suryakumar Yadav Captains Mumbai Indians vs CSK IPL 2025

"అది నా నియంత్రణలో లేదు. గత సంవత్సరం ఆటలో భాగంగా స్లో ఓవర్ రేట్ జరిగింది. చివరి ఓవర్‌ను ఒకటిన్నర లేదా రెండు నిమిషాలు ఆలస్యంగా వేశాం. ఆ సమయంలో దాని పరిణామాలు నాకు తెలియవు" అని హార్దిక్ పాండ్యా అన్నాడు. అలాగే, తాను లేని సమయంలో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించడానికి సరైన ఎంపిక అని కూడా హార్దిక్ అన్నాడు.

55
Suryakumar Yadav Captains Mumbai Indians vs CSK IPL 2025

Suryakumar Yadav Captains Mumbai Indians vs CSK IPL 2025

2024లో ముంబై ఇండియన్స్ జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా హార్దిక్ నియమితుడయ్యాడు. ముంబై టీమ్ ను 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ శర్మ స్థానంలో హర్దిక్  నియమితుడయ్యాడు. 

హార్దిక్ 45 ఐపీఎల్ మ్యాచ్‌లకు కెప్టెన్ గా ఉన్నాడు. ఇందులో 26 మ్యాచ్ లను గెలవగా, 19 ఓడిపోయాడు. పాండ్యా గెలుపు శాతం దాదాపు 57.7% ఉంది. ఐపీఎల్ 2024లో ముంబై 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి చివరి స్థానంలో నిలిచింది. 

దీనికి ముందు, హార్దిక్ పాండ్యా రెండు సీజన్లు గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించాడు. మొదటి సీజన్‌లో ట్రోఫీని అందించగా, ఆ తర్వాతి సీజన్ లో రన్నరప్‌గా నిలిపాడు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved