MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అప్పుడు రిటైర్మెంట్‌ తీసుకున్నందుకు ఫీల్ అవుతున్న సురేష్ రైనా... మిస్టర్ ఐపీఎల్ త్యాగం వృథా...

అప్పుడు రిటైర్మెంట్‌ తీసుకున్నందుకు ఫీల్ అవుతున్న సురేష్ రైనా... మిస్టర్ ఐపీఎల్ త్యాగం వృథా...

మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే తాను కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా. అయితే ఎమ్మెస్ ధోనీ వంటి సునామీ వల్ల, సురేష్ రైనా వంటి నదీ ప్రవాహాన్ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 15 2022, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

2020, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజునే అంతర్జాతీయ క్రికట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు ఎమ్మెస్ ధోనీ, సురేష్ రైనా. మాహీకి ఆత్మీయ మిత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న రైనా... ధోనీ కెప్టెన్సీలో చాలా మ్యాచుల్లో భారత జట్టుకి ఆడాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

చెన్నై సూపర్ కింగ్స్‌కి ఈ ఇద్దరూ కలిసి ఎన్నో విజయాలు అందించారు. అంతర్జాతీయ మ్యాచుల్లో వరుసగా ఫెయిల్ అవుతున్నా సురేష్ రైనాకి అవకాశాలు ఇస్తూ, ప్రోత్సహిస్తూ వచ్చాడు ఎమ్మెస్ ధోనీ. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ వంటి క్రికెటర్లు... ఈ విషయాన్ని చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు...

310

ఫామ్‌లో ఉన్న యూసఫ్ పఠాన్ వంటి ఆల్‌రౌండర్‌ని పక్కనబెట్టి, ఎమ్మెస్ ధోనీ తన స్నేహితుడు కావడం వల్లే సురేష్ రైనాని ఆడిస్తూ వచ్చాడని యువరాజ్ సింగ్ చేసిన కామెంట్లు సంచలనం క్రియేట్ చేశాడు. అయితే సురేష్ రైనా మరీ అంత తక్కువ అంచనా వేయాల్సిన క్రికెటర్ ఏమీ కాదు...

410

టీమిండియా తరుపున 226 వన్డేలు, 78 టీ20 మ్యాచులు, 18 టెస్టు మ్యాచులు ఆడిన సురేష్ రైనా, ఓవరాల్‌గా 8 వేల అంతర్జాతీయ పరుగులు చేశాడు. వన్డేల్లో 5615 పరుగులు చేసిన సురేష్ రైనా, మిడిల్ ఆర్డర్‌లో మాహీ, యువరాజ్ సింగ్‌లతో కలిసి చాలా మ్యాచుల్లో భారత జట్టుకి విజయాలు అందించాడు...

510

అయితే ఐపీఎల్ కారణంగా సురేష్ రైనా, భారత జట్టులో అనుకున్నంత రాణించలేకపోయాడు. ఐపీఎల్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడిన రైనా, భారత జట్టుకి ఆడే సమయంలో మాత్రం ఒక్క ఫోర్ కొట్టడానికి తెగ కష్టపడుతున్నట్టు కనిపించేవాడు. ఈ కారణంగానే రైనాని అందరూ ‘మిస్టర్ ఐపీఎల్’ అని పిలుస్తారు. అంటే ఐపీఎల్‌లో మాత్రమే ఆడతాడని..!

610

తనకి ఎన్నో మ్యాచుల్లో అవకాశం ఇచ్చి, వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చి... కొన్ని మ్యాచులకు కెప్టెన్సీ చేసే ఛాన్స్ కూడా ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీకి తన అంతర్జాతీయ కెరీర్‌ని అంకితమిచ్చిన సురేష్ రైనా.. మాహీతో పాటు తాను కూడా రిటైర్మెంట్ ఇస్తున్నట్టు ప్రకటించాడు...

710

మాహీ రిటైర్మెంట్‌పై క్రికెట్ ప్రపంచంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలు అందరూ స్పందించగా రైనాకి వచ్చిన రియాక్షన్ చాలా తక్కువ. మాహీతో పాటే రిటైర్ కావడం వల్ల రైనాకి తగినంత గుర్తింపు దక్కలేదు...

810

అంతేకాకుండా రిటైర్మెంట్ తర్వాత 2020 సీజన్‌లో మాహీతో గొడవ పడిన సురేష్ రైనా, సరిగ్గా ఆడడం లేదని ఐపీఎల్ 2021 సీజన్‌లో తుది జట్టులో చోటు కోల్పోయాడు. 2022 మెగా వేలంలో సురేష్ రైనాని తిరిగి కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రాలేదు చెన్నై సూపర్ కింగ్స్...

910

ఐపీఎల్‌లో 5600లకు పైగా పరుగులు చేసి, సీ‌ఎస్‌కేకి మూడు టైటిల్స్ దక్కడంలో కీలక పాత్ర పోషించిన సురేష్ రైనాని, అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో కూర్చోబెట్టి ఘోరంగా అవమానించింది చెన్నై సూపర్ కింగ్స్. మాహీ కావాలంటే రైనా టీమ్‌లోకి వచ్చేవాడే. అయితే రైనాని తిరిగి కొనుగోలు చేయడానికి ధోనీ ఇష్టపడకపోవడం వల్లే సీఎస్‌కే, అతన్ని తీసుకోలేదనేది అందరికీ తెలిసిన విషయమే...

1010

ఈ సంఘటనల కారణంగా మాహీతో కలిసి రిటైర్మెంట్ ఇచ్చి తప్పు చేశానని సురేష్ రైనా ఫీల్ అవుతున్నాడని... ఆ రోజున ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఇప్పటికీ అంతర్జాతీయ మ్యాచులు ఆడే అవకాశం రాకపోయినా  భారత క్రికెటర్‌గా కనీస గౌరవం దక్కి ఉండేదని తన సన్నిహితులతో వాపోతున్నాడని ఈ మిస్టర్ ఐపీఎల్...

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
Recommended image2
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image3
IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved