- Home
- Sports
- Cricket
- కేన్ విలియంసన్‌కి కెప్టెన్సీ ఇవ్వండి, డేవిడ్ వార్నర్ చెత్త ఆలోచన... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...
కేన్ విలియంసన్‌కి కెప్టెన్సీ ఇవ్వండి, డేవిడ్ వార్నర్ చెత్త ఆలోచన... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదింట్లో ఓటమి పాలైంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ప్లేఆఫ్‌కి అర్హత సాధించాలంటే మిగిలిన మ్యాచుల్లో కనీసం ఆరు మ్యాచుల్లో గెలవాల్సి ఉంటుంది సన్‌రైజర్స్. దీంతో ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్సీలో మార్పు చేయాలంటున్నాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నానని చెప్పాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. 57 బంతుల్లో 55 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, తన స్లో బ్యాటింగ్ కారణంగా జట్టు నష్టపోయిందని అంగీకరించాడు...

‘డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా ఒత్తిడికి గురైనట్టు కనిపించాడు. ఈజీగా భారీ షాట్లు ఆడే డేవిడ్ వార్నర్, టైమింగ్‌ను కాకుండా బంతిని బలంగా బాదాలని ప్రయత్నించి విఫలమయ్యాడు.

డేవిడ్ వార్నర్ ఇంత స్లోగా ఆడతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. బెయిర్ స్టో అవుట్ అయ్యాక మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవుతోందనే ఆలోచనతో వార్నర్ ఇలా నెమ్మదిగా బ్యాటింగ్ చేసి ఉండవచ్చు. అయితే మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇలా నెమ్మదిగా ఆడితే రిజల్ట్ మారిపోతుంది.

వికెట్ బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తోంది. మనీశ్ పాండే కూడా చక్కగా ఆడాడు. అలాంటిది వార్నర్ మాత్రం బంతికో పరుగు తీశాడు. కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ పూర్తిగా విఫలమయ్యాడు. అతనికి ఏ మాత్రం రేటింగ్ ఇవ్వను.

డేవిడ్ వార్నర్ చక్కని కెప్టెన్. ఇంతకుముందు అతను సన్‌రైజర్స్‌కి ఎన్నో విజయాలు అందించాడు. అయితే ఇప్పుడు అతను చాలా ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. ఈ పరిస్థితి నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ కోలుకోవాలంటే కేన్ విలియంసన్‌ను కెప్టెన్‌గా చేయాలి...

కేన్ విలియంసన్ అద్భుతమైన కెప్టెన్. జట్టును ముందుండి నడిపించడమే కాదు, ప్లేయర్లను ఎలా వాడుకోవాలో కేన్‌కి బాగా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వార్నర్ కంటే కేన్ విలియంసన్ అవసరం సన్‌రైజర్స్‌కి ఎక్కువగా ఉంది’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.

2018 సీజన్‌లో డేవిడ్ వార్నర్ గైర్హజరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా వ్యవహారించాడు కేన్ విలియంసన్. ఆ సీజన్‌లో 735 పరుగులతో అద్భుతంగా రాణించిన కేన్ విలియంసన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఫైనల్ చేర్చాడు.

కొందరు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కూడా కేన్ విలియంసన్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆరెంజ్ ఆర్మీ కోసం ఎంతో చేసిన డేవిడ్ వార్నర్‌కి కష్టకాలంలో తోడు ఉండాల్సిన బాధ్యత అభిమానులకు ఉందని అంటున్నారు.