SRHvsPBKS: బౌలర్లు అదరగొట్టారు, ఇక సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌దే భారం...
ఐపీఎల్ 2021 సీజన్‌లో మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అద్భుత బౌలింగ్‌లో ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్, ఆరెంజ్ ఆర్మీ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా నిర్ణీత 19.4 ఓవర్లలో 120 పరుగులకే పరిమితమైంది...

అభిషేక్ శర్మతో మొదటి ఓవర్ వేయించాడు సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. తొలి ఓవర్ ఆఖరి బంతికి మయాంక్ అగర్వాల్ ఇచ్చిన క్యాచ్‌ను రషీద్ ఖాన్ మిస్ చేశాడు...

భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన కెఎల్ రాహుల్, కేదార్ జాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పంజాబ్ కింగ్స్...

25 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికే పూరన్ రనౌట్ అయ్యాడు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడిన మొదటి రెండు మ్యాచుల్లో డకౌట్ అయిన పూరన్, నేటి మ్యాచ్‌లో బంతులేమీ ఎదుర్కోకుండానే రనౌట్ రూపంలో డైమండ్ డకౌట్ కావడం విశేషం...

ఆ తర్వాతి ఓవర్‌లో రషీద్ ఖాన్, ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్‌ను అవుట్ చేశాడు. 17 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన క్రిస్ గేల్, ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

11 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన దీపక్ హూడాను అభిషేక్ శర్మ... ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయగా, 17 బంతుల్లో 14 పరుగులు చేసిన హెండ్రిక్స్ కూడా అతని బౌలింగ్‌లోనే స్టంపౌట్ అయ్యాడు.

ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఫ్యాబియన్ ఆలెన్, డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా 17 బంతుల్లో 2 సిక్సర్లతో 22 పరుగులు చేసిన షారుక్ ఖాన్, కూడా అతని బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు.

20వ ఓవర్ మొదటి బంతికే మురుగన్ అశ్విన్‌ను అవుట్ చేశాడు సిద్ధార్థ్ కౌల్. నాలుగో బంతికి షమీ రనౌట్ కావడంతో పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ 120 పరుగుల వద్ద తెరపడింది.
ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.... అభిషేక్ శర్మ రెండు, భువీ, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్ తలా ఓ వికెట్ తీశారు.