భార్యను మధ్యలోనే వదిలేసి వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హోల్డర్...

First Published 23, Oct 2020, 6:12 PM

IPL 2020 సీజన్‌లో ఆటగాళ్లను గాయాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.  గాయాల కారణంగా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. మొదటి మ్యాచ్‌లో గాయపడిన మిచెల్ మార్ష్, ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ గాయంతో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. వీరి స్థానంలో జట్టులోకి వచ్చిన విండీస్ ప్లేయర్ జాసన్ హోల్డర్, ఆడిన మొదటి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

కేన్ విలియంసన్ గాయం కారణంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలో దిగలేదు. దీంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చాడు హోల్డర్.

మంచి టచ్‌లో కనిపించిన యంగ్ బ్యాట్స్‌మెన్‌ సంజూ శాంసన్‌తో పాటు ఆర్ఆర్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, రియాన్ పరాగ్‌లను అవుట్ చేశాడు జాసన్ హోల్డర్...

2016లో చివరిసారిగా ఐపీఎల్ ఆడిన హోల్డర్‌కి ఆ తర్వాత మూడు సీజన్లలో పెద్దగా అవకాశాలు రాలేదు...

‘మళ్లీ ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కోసం ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్నా... ఎట్టకేలకు అవకాశం దక్కింది... మొదటి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం సంతోషంగా ఉంది...’ అని చెప్పుకొచ్చాడు హోల్డర్.

నిజానికి జాసన్ హోల్డర్ తన భార్యతో కలిసి వెకేషన్‌కి వెళ్లాడట. సడెన్‌గా సన్‌రైజర్స్ నుంచి పిలుపు రావడంతో మధ్యలోనే వచ్చేశాడట.

వెకేషన్ మధ్యలోనే నా భార్యను వదిలేసి రావడం చాలా కష్టంగా అనిపించింది. కానీ క్రికెట్ కోసం అలా చేయక తప్పదు’... అని చెప్పుకొచ్చాడు జాసన్ హోల్డర్.

టోర్నీ ఆరంభంలోనే యూఏఈ చేరుకున్న జాసన్ హోల్డర్‌కి జట్టులో అవకాశం దక్కలేదు... వార్నర్, బెయిర్‌స్టో, కేన్ విలియంసన్, రషీద్ ఖాన్ ఈ నలుగురు విదేశీ ప్లేయర్ల కోటాలో ఫిక్స్ కావడంతో మిగిలిన ప్లేయర్లకు అవకాశం రాలేదు.

కేన్ విలియంసన్ గాయపడడంతో ఆ ప్లేస్‌లో ఎంట్రీ ఇచ్చాడు హోల్డర్... కీలక మ్యాచ్‌లో 3 ఓవర్లలో 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.