MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs PAK: ‘మోకా మోకా’ యాడ్ లేకుండానే దాయాదుల పోరు.. కారణం అదేనా..?

IND vs PAK: ‘మోకా మోకా’ యాడ్ లేకుండానే దాయాదుల పోరు.. కారణం అదేనా..?

Mauka Mauka Add: గడిచిన రెండు వన్డే ప్రపంచకప్పులు, రెండు టీ20 వరల్డ్ కప్ లలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ఎంత క్రేజ్ ఉందో.. స్టార్ స్పోర్ట్స్ రూపొందించే ‘మోకా మోకా’ యాడ్ కూ అంతే క్రేజ్ ఉండేది.

2 Min read
Srinivas M
Published : Aug 03 2022, 05:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కంటే ముందే అభిమానులను అలరించే ‘మోకా మోకా’ (అవకాశం) యాడ్ ఇకనుంచి నిలిచిపోనుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. త్వరలో ఆసియా కప్-2022లో ఇండియా-పాకిస్తాన్ లు మళ్లీ రసవత్తరపోరుకు దిగనున్న క్రమంలో ఈ యాడ్ ఎలా ఉండబోతుందని అందరూ  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

27

ఈ తరుణంలో ఇకనుంచి ఈ యాడ్ ప్రసారం ఉండదని స్టార్ స్పోర్ట్స్ తేల్చేసినట్టు సమాచారం. త్వరలో జరిగే ఆసియా కప్ తో పాటు అక్టోబర్ లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ పోటీలకు కూడా ఈ యాడ్ ను రూపొందించే ఉద్దేశం లేనట్టు స్టార్ స్పోర్ట్స్ వర్గాలు తెలిపాయి. 
 

37

2015 నుంచి ఈ యాడ్ ను స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేస్తున్నది. ఆ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కు ముందు ఈ యాడ్ ను మొదటిసారిగా ప్రదర్శించారు. మూడు తరాలకు చెందిన ఒక కుటుంబలోని వ్యక్తులు (పాకిస్తాన్) ప్రపంచకప్ లో పాకిస్తాన్.. భారత్ ను ఓడిస్తే సంబురాలు చేసుకోవాలనేది ఈ యాడ్ థీమ్. 

47

కానీ  ప్రతీసారి వాళ్ల ఆశలు అడియాసలే అయ్యేవి. దీంతో వాళ్లు  తాము దాచుకున్న టపాసులను మళ్లీ అటకెక్కించేవారు. గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్ లో కూడా ఈ యాడ్ ను కొత్త తరహాలో రూపొందించి ప్రసారం చేశారు. 

57

అయితే త్వరలో జరుగబోయే ఆసియా కప్-2022లో భారత్-పాక్ లు ఆగస్టు 28న తలపడనున్నాయి. ఈ పోరుకు మాత్రం ‘మోకా మోకా’యాడ్ ఉండదట.  వాస్తవానికి ఈ యాడ్ ముఖ్యోద్దేశం  కూడా గత ప్రపంచకప్ తో తీరింది. 2021 టీ20  ప్రపంచకప్ లో  పాకిస్తాన్.. భారత్ ను ఓడించింది.

67

దీంతో ఇన్నాళ్లు అవకాశం కోసం చూసిన ఆ దేశం గెలిచిందనే సందేశం దాంతోనే ముగిసిపోయింది. ఇక ఇప్పుడు మళ్లీ దీనిని ప్రసారం చేయడంలో ఏమాత్రం అర్థం లేదని స్టార్ నిర్వాహకులు భావిస్తున్నారట. 

77

అదీగాక ఈ యాడ్ పై పాకిస్తాన్ లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.  ప్రతీసారి తమ దేశాన్ని అవమానిస్తున్నారని అక్కడి క్రికెట్ ప్రేమికులు వాపోతున్నారు. గతేడాది టీ20   ప్రపంచకప్ సందర్భంగా ఈ యాడ్ ను బ్యాన్ చేయాలని కూడా సోషల్ మీడియా వేదికగా  పాక్ క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు.  దీంతో ఈసారి మోకా మోకా లేకుండానే భారత్-పాక్ మ్యాచ్ చూడాల్సి ఉంటుంది. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved