శ్రీలంక క్రికెటర్‌కి కరోనా పాజిటివ్... భారత్- శ్రీలంక సిరీస్ రద్దు ఖాయమేనా...
శ్రీలంక బృందంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకి చేరింది. ఇప్పటికే లంక బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌తో పాటు డేటా అనాలసిస్ట్ నిరోషన్ కరోనా బారిన పడగా, తాజాగా లంక క్రికెటర్ సందున్ వీరాక్కోడికి చేసిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.

కోలంబోలోని సినిమాన్ గ్రాండ్‌లో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్న వీరాక్కోడికి పాజిటివ్ రావడంతో భారత బృందంతో ఆందోళన మొదలైంది. అయితే ఇతను ఇంగ్లాండ్ టూర్ నుంచి స్వదేశానికి వచ్చిన లంక జట్టులో లేడు.

భారత్‌తో వన్డే, టీ20 సిరీస్ కోసం కొలంబోలోని బయో బబుల్ జోన్‌లోకి వచ్చాడు. వీరాక్కోడితో పాటు భనుక రాజపక్ష, అసెలా గుణరత్నే, ఏంజెలో పెరేరా ఈ బయో బబుల్‌లో గడిపారు.

దీంతో వీరంతా మరోసారి క్వారంటైన్‌లోకి వెళ్లనున్నారు. దంబుల్లాలో ఏర్పాటుచేసిన బయో బబుల్‌లో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన 26 మంది క్రికెటర్లు క్వారంటైన్‌లో గడుపుతున్నారు. వీరిలో కరోనా కేసులు నమోదుకాలేదు.

ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం జూలై 13న ప్రారంభం కావాల్సిన సిరీస్‌ను శ్రీలంక బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో జూలై 18కి వాయిదా వేసింది బీసీసీఐ.

ఇప్పుడు కూడా కొత్త కేసులు వెలుగుచూస్తూ ఉండడంతో ఈ సిరీస్ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు రేగుతున్నాయి... ఇలాగే కొనసాగితే బీసీసీఐ ఈ సిరీస్‌ను రద్దు చేసి, భారత ప్లేయర్లను వెనక్కి పిలిపించే అవకాశం ఉంది.

వాస్తవానికి శ్రీలంకతో సిరీస్ గత ఏడాది జరగాల్సింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా అప్పుడు రద్దైన సిరీస్‌ను, ఇప్పుడు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే ఈసారి కూడా పరిస్థితులు అనుకూలించడం లేదు.