- Home
- Sports
- Cricket
- వాళ్లవల్లే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సర్వనాశనమైంది! వార్నర్, రషీద్ ఖాన్‌లను... - మహ్మద్ నబీ
వాళ్లవల్లే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సర్వనాశనమైంది! వార్నర్, రషీద్ ఖాన్‌లను... - మహ్మద్ నబీ
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. మొదటి 8 సీజన్లలో ఐదు సార్లు ప్లేఆఫ్స్‌కి వెళ్లిన సన్‌రైజర్స్, రెండు సార్లు ఫైనల్ ఆడి ఓ సారి టైటిల్ గెలిచింది. అయితే అది పాత మాట. రెండు సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది...

Rashid Khan
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది...
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి అన్నీ తానుగా ఉండి, బ్యాటింగ్ భారాన్ని మోస్తూ వచ్చిన డేవిడ్ వార్నర్‌ని, 2021 సీజన్‌లో ఘోరంగా అవమానించి... కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆఖరికి టీమ్‌లో కూడా లేకుండా చేసింది ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్...
డేవిడ్ వార్నర్‌తో పాటు మిగిలిన ప్లేయర్లు అందరూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని వదిలి వెళ్లిపోయారు. కేన్ విలియంసన్‌ని అట్టిపెట్టుకుని, ఐపీఎల్ 2022 కెప్టెన్సీ అప్పగించిన ఆరెంజ్ ఆర్మీ... 2023 సీజన్ మినీ వేలంలో అతన్ని కూడా వేరే జట్టుకి వదిలేసింది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ మహ్మద్ నబీ, ఆరెంజ్ ఆర్మీ టీమ్ మేనేజ్‌మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు..
2017లో రషీద్ ఖాన్‌తో కలిసి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడాడు మహ్మద్ నబీ. మొదటి మూడేళ్లు ఆరెంజ్ ఆర్మీ తరుపున ఆడడాన్ని తెగ ఎంజాయ్ చేశానన్న నబీ, టీమ్ మేనేజ్‌మెంట్ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
‘నేను, రషీద్ ఖాన్ కలిసి 2017లో సన్‌రైజర్స్‌కి వచ్చాం. మొదటి మూడు సీజన్లు చాలా బాగా ఎంజాయ్ చేశాం. టీమ్ కాంబినేషన్, పర్ఫామెన్స్‌లు బాగా కుదిరేవి. అయితే గత రెండు సీజన్లలో టీమ్‌ని సర్వనాశనం చేశారు...
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఎవరు ఇలా చేశారు? ఎందుకు చేశారు? అంటే చెప్పడం కష్టం. కానీ టీమ్ కాంబినేషన్ కానీ, కోచింగ్ స్టాఫ్ కానీ సెట్ అవ్వడం లేదు.. ఆఖరికి టీమ్ వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. పెద్ద ఫ్రాంఛైజీల్లో ఇదీ ఒకటి. అలాంటి వాళ్లు వీలైతే పటిష్టమైన టీమ్‌ని నిర్మించాలని చూడాలి, అంతేకానీ ఇలా సర్వనాశనం చేయకూడదు. ఒక్కసారిగా టీమ్‌లో అన్ని మార్పులు చేసే కంటే నెమ్మదిగా టీమ్‌ని పటిష్టంగా చేయడం అవసరం...
రషీద్ ఖాన్‌ని వేరే టీమ్‌కి వెళ్లనిచ్చారు. అతను సన్‌రైజర్స్‌కి బ్రాండ్‌గా ఉన్నాడు. అలాగే డేవిడ్ వార్నర్‌ని పంపేశారు. టాప్ ప్లేయర్లను ఎలా ట్రీట్ చేయాలో ఆ గౌరవం వారికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవ్వలేదు. వాళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు.. ’ అంటూ కామెంట్లు చేశాడు ఆఫ్ఘాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ..