MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • SA vs AUS : చోకర్స్ కాదు ఛాంపియన్స్: డబ్ల్యూటీసీ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా

SA vs AUS : చోకర్స్ కాదు ఛాంపియన్స్: డబ్ల్యూటీసీ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా

South Africa vs Australia: సౌతాఫ్రికా 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆసీస్‌పై 5 వికెట్లతో విజయం సాధించి ప్రోటీస్ జట్టు తొలి డబ్ల్యూటీసీ టైటిల్‌ను సాధించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 14 2025, 06:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
WTC Final 2025: 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచిన సౌతాఫ్రికా
Image Credit : Getty

WTC Final 2025: 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచిన సౌతాఫ్రికా

సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఆ దేశ క్రికెట్ చరిత్రలో కీలక మలుపు. 27 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌ను గెలుచుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో, సౌతాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి, తన మొదటి డబ్ల్యూటీసీ టైటిల్‌ను అందుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
WTC Final 2025: మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆధిక్యం
Image Credit : X/ICC

WTC Final 2025: మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆధిక్యం

సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 212 పరుగులు చేసింది. వెబ్ స్టర్ 72, స్టీవ్ స్మిత్ 66 పరుగులతో రాణించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబాడా 5 వికెట్లు, మార్కో యాన్సెన్ 3 వికెట్లు తీశారు.

తర్వాత, సౌతాఫ్రికా జట్టు 138 పరుగులకే ఆలౌట్ అయింది. డేవిడ్ బెడింగమ్ 45, బవుమా 36 పరుగులు చేశారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 6 వికెట్లు తీసి సఫారీ బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. దీంతో ఆసీస్‌కు 74 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

36
WTC Final 2025: రెండవ ఇన్నింగ్స్‌లో ఆట మళ్లీ మారింది
Image Credit : stockPhoto

WTC Final 2025: రెండవ ఇన్నింగ్స్‌లో ఆట మళ్లీ మారింది

ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కంగారూ జట్టు సౌతాఫ్రికాకు 277 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సఫారీ బౌలర్లు మ్యాచ్‌లో కీలకంగా నిలిచారు. ఆ తర్వాత బ్యాటర్లు కూడా అదరగొట్టారు.

46
WTC Final 2025: ఐడెన్ మార్క్రమ్ - టెంబా బవుమా మ్యాజిక్
Image Credit : Getty

WTC Final 2025: ఐడెన్ మార్క్రమ్ - టెంబా బవుమా మ్యాజిక్

సౌతాఫ్రికా రెండవ ఇన్నింగ్స్‌లో ధైర్యంగా బ్యాటింగ్ చేసింది. ఐడెన్ మార్క్రమ్ 136 పరుగుల అద్భుత సెంచరీ కొట్టి జట్టును విజయపథంలోకి తీసుకెళ్లాడు. టెంబా బవుమా 66 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముల్డర్ 27 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

మార్క్రమ్ 207 బంతుల్లో 14 ఫోర్లతో 136 పరుగులు చేసి చివరికి జట్టు విజయం వద్ద నిలిచినప్పుడు ఔటయ్యాడు. కానీ అప్పటికే మ్యాచ్ దాదాపు సౌతాఫ్రికా కైవసం అయింది.

56
WTC Final 2025: 1998 తర్వాత తొలి ఐసీసీ టైటిల్ గెలిచిన ప్రోటీస్ జట్టు
Image Credit : Getty

WTC Final 2025: 1998 తర్వాత తొలి ఐసీసీ టైటిల్ గెలిచిన ప్రోటీస్ జట్టు

ఇది సౌతాఫ్రికా గెలిచిన రెండో ఐసీసీ ట్రోఫీ. గతంలో 1998లో జరిగిన ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్‌లో విజయం సాధించింది. అనంతరం చాలా సార్లు సెమీఫైనల్‌, ఫైనల్ దశల్లో ఓటమి పాలై, “చోకర్స్” అన్న ముద్రను మూటగట్టుకున్న సౌతాఫ్రికా, ఇప్పుడు ఆ ముద్రను తొలగించుకుంది. చోకర్స్ కాదు ఛాంపియన్స్ అని నిరూపించుకుంది.

66
WTC Final 2025: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ - ప్రతి సారి కొత్త ఛాంపియన్
Image Credit : Getty

WTC Final 2025: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ - ప్రతి సారి కొత్త ఛాంపియన్

ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ లో ఇది మూడో సీజన్. మొదటిసారి (2019–2021) న్యూజిలాండ్, రెండవసారి (2021–2023) ఆస్ట్రేలియా విజయం సాధించగా, ఈసారి (2023–2025) సౌతాఫ్రికా విజేతగా అవతరించింది. ప్రతి సీజన్‌లోనూ కొత్త విజేతలు రావడం విశేషం.

ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ భారత్ మొదటి రెండు సీజన్లలో ఫైనల్ వరకు వెళ్లింది. కానీ, రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. మూడో సీజన్ లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
WTC ఫైనల్ ప్రైజ్ మనీ ఎంత? రన్నరప్‌కు ఎంత దక్కుతుంది?
Recommended image2
SBI - హోమ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ - వడ్డీ రేట్లు తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved