- Home
- Sports
- Cricket
- గంగూలీకి, రాహుల్ ద్రావిడ్ ముందే ఈ విషయం చెప్పాడా? బలవంతంగా ఒప్పించి, టీమిండియా హెడ్ కోచ్‌గా...
గంగూలీకి, రాహుల్ ద్రావిడ్ ముందే ఈ విషయం చెప్పాడా? బలవంతంగా ఒప్పించి, టీమిండియా హెడ్ కోచ్‌గా...
టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు అందుకుని ఏడాది కూడా పూర్తి కాకముందే రెండు సార్లు బ్రేక్ తీసుకున్నాడు రాహుల్ ద్రావిడ్... ఐర్లాండ్ పర్యటనలో టీమిండియాకి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్, ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు... టీ20 వరల్డ్ కప్ 2022 పరాజయంతో రాహుల్ ద్రావిడ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి...

Image credit: Getty
టీమిండియాకి నాలుగేళ్ల పాటు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు రవిశాస్త్రి. అయితే ఒక్క నెల కూడా బ్రేక్ కావాలని బాధ్యతల నుంచి తప్పుకోలేదు. ఇంగ్లాండ్ టూర్‌లో ప్రధాన జట్టు బిజీగా ఉన్న సమయంలో లంకలో పర్యటించిన మరో జట్టుకి రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహరించడం తప్ప, నాలుగేళ్ల పాటు రవిశాస్త్రి కోచింగ్‌లోనే ఆడింది భారత జట్టు...
Image credit: Getty
రాహుల్ ద్రావిడ్ ఏడాది కాలంలో రెండు సార్లు బ్రేక్ తీసుకోవడంపై రవిశాస్త్రి కూడా తీవ్ర విమర్శలు చేశాడు. ఐపీఎల్ సమయంలో రెండున్నర నెలలు బ్రేక్ దొరుకుతున్నప్పుడు మళ్లీ మళ్లీ బ్రేకులు తీసుకోవడం ఎందుకంటూ రాహుల్ ద్రావిడ్‌ని ప్రశ్నించాడు రవిశాస్త్రి...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ద్రావిడ్‌ను ఒప్పించడానికి బీసీసీఐ అప్పటి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... చాలా పెద్ద తతంగమే నడిపించాల్సి వచ్చింది. భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు తీసుకుంటే కనీసం 8 నుంచి 10 నెలల పాటు ఇంటికి దూరంగా ఉండాలి...
Image credit: PTI
రాహుల్ ద్రావిడ్‌కి టీనేజ్ వయసుకి వస్తున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారితో గడపాలనే ఉద్దేశంతోనే రాహుల్ ద్రావిడ్, ఎన్ని అవకాశాలు వచ్చినా వాటిని స్వీకరించలేదు. అయితే రవిశాస్త్రి తర్వాత టీమిండియాని నడిపించడానికి ద్రావిడ్ కరెక్ట్ అని భావించిన గంగూలీ బలవంతంగా ఒప్పించాడని తెలుస్తోంది...
Image credit: PTI
అయితే టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకునే సమయంలోనే కుటుంబంతో గడిపేందుకు రెండు మూడునెలలకోసారి బ్రేక్ తీసుకుంటానని రాహుల్ ద్రావిడ్ చెప్పాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్ష పదవిలో లేడు. అప్పటి సెలక్షన్ కమిటీ కూడా లేదు. దీంతో రాహుల్ ద్రావిడ్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది...
Image credit: PTI
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ విషయంపై తన స్టైల్‌లో స్పందించాడు. ‘టీ20 వరల్డ్ కప్ 2022 కోసం కొన్ని నెలలుగా ప్రాక్టీస్ చేస్తూ, ప్రణాళికలు రూపొందిస్తూ గడిపేశాం. ఇప్పుడు న్యూజిలాండ్‌లో పర్యటించే జట్టు పూర్తిగా కొత్తది. వాళ్లకి ఓ ఫ్రెష్ ఫీలింగ్ కావాలి. అందుకే వీవీఎస్ లక్ష్మణ్‌ని అక్కడికి పంపించారు...
రెండు నెలలకు పైగా వర్క్‌లోడ్‌తో సతమతమైన తర్వాత కొన్ని రోజులు కుటుంబంతో గడపాలని అనుకోవడం తప్పు కాదు. అదీకాకుండా న్యూజిలాండ్ టూర్ ముగిసిన వెంటనే బంగ్లా టూర్ ప్రారంభం అవుతోంది. దానిపై ఫోకస్ పెట్టేందుకు కాస్త సమయం కూడా దొరుకుతుంది...’ అంటూ వ్యాఖ్యానించాడు రవిచంద్రన్ అశ్విన్..