MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Slowest ball in IPL 2025: ఐపీఎల్ లో స్లోయెస్ట్ బాల్.. సత్యనారాయణ రాజు ఏందయ్యా ఇది !

Slowest ball in IPL 2025: ఐపీఎల్ లో స్లోయెస్ట్ బాల్.. సత్యనారాయణ రాజు ఏందయ్యా ఇది !

Mumbai Indians Telugu pacer Satyanarayana Raju: ఐపీఎల్ 2025లో తెలుగు ప్లేయర్ సత్యనారాయణ రాజు ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే, అతను IPL చరిత్రలో అత్యంత నెమ్మదిగా బాల్ వేసి హాట్ టాపిక్ అవుతున్నాడు. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Mar 29 2025, 11:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Slowest ball in IPL history: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 9వ మ్యాచ్ లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తెలుగు ప్లేయర్, ముంబై జట్టు నుంచి ఐపీఎల్ అరంగేట్రం చేసిన సత్యనారాయణ రాజు ఐపీఎల్ చరిత్రలో అత్యంత నెమ్మదిగా బంతిని విసిరి వార్తల్లో నిలిచాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Gujarat Titans' Jos Buttler in action

Gujarat Titans' Jos Buttler in action

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల పేసర్ గుజరాత్ ఇన్నింగ్స్‌లోని 13వ ఓవర్‌లో జోస్ బట్లర్ బ్యాటింగ్ చేస్తుండగా ఐపీఎల్ లో నెమ్మదైన బంతిని వేశాడు. అది జోస్ బట్లర్‌ను చేరుకోవడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంది. బట్లర్ ఆగి మరి ఆ షాట్ ను ఆడాడు.

చాలా స్లోగా వచ్చిన  ఆ డెలివరీని డీప్ స్క్వేర్ లెగ్‌ పై నుంచి బౌండరీ బాదాడు. ఆ డెలివరీ ఆడిన తర్వాత బట్లర్ నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సత్యనారాయణ రాజు ఐపీఎల్ స్లోయెస్ట్ బాల్ వీడియో ఇక్కడ చూడండి 

35
Slowest ball in IPL history? Mumbai Indians Telugu pacer Satyanarayana Raju surprises Jos Buttler

Slowest ball in IPL history? Mumbai Indians Telugu pacer Satyanarayana Raju surprises Jos Buttler

సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు సత్యనారాయణ రాజు డెలివరీని వెస్టిండీస్ గ్రేట్ డ్వేన్ బ్రావో వేసిన కొన్ని స్లో బాల్ లతో పోల్చారు. ఎందుకంటే చాలా సార్లు బ్రావో స్లో డెలివరీలతో స్టార్ ప్లేయర్లను పెవిలియన్ కు పంపాడు. కానీ, సత్యనారాయణ రాజు వేసిన బంతులతో అలాంటి మ్యాజిక్ జరగలేదు. రాజు తన 3 ఓవర్ల స్పెల్ లో 40 పరుగులు ఇచ్చాడు కానీ ముంబై ఇండియన్స్ తరపున చివరి ఓవర్ ను అద్భుతంగా వేశాడు.

 

45

 రాజు స్లో బాల్ తో పాటు అతని ఐపీఎల్ తొలి వికెట్ తీసుకోవడం కూడా ఈ మ్యాచ్ లో  హైలెట్ గా నిలిచింది. రషీద్ ఖాన్ సిక్స్ కొట్టి జోష్ లో ఉన్న సమయంలో ఇన్నింగ్స్ చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన రాజు.. అతన్ని అవుట్ చేసి ఐపీఎల్ లో తన తొలి వికెట్ ను సాధించాడు. 

55
Slowest ball in IPL history? Mumbai Indians Telugu pacer Satyanarayana Raju surprises Jos Buttler

Slowest ball in IPL history? Mumbai Indians Telugu pacer Satyanarayana Raju surprises Jos Buttler

చాలా మందిని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విఘ్నేష్ పుతూర్ అద్భుతంగా ఆడినప్పటికీ, కీలకమైన ఓవర్లలో రాజును నమ్మింది ముంబై ఇండియన్స్. ఈ సీజన్ లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన రాజు.. దేశవాళీ క్రికెట్ లో, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ లో అరంగేట్రం చేయడానికి ముందు అతను కేవలం 8 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
RCB vs GT: ధర్మశాలలో ఆర్సీబీ విధ్వంసం.. గుజరాత్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లిన బెంగళూరు!
Recommended image2
IPL Hit Wicket : హిస్టరీలోనే ఇలాంటి అవుట్ ఎప్పుడూ చూసుండరు.. అయ్యో సాయి సుదర్శన్ ! ఇలా అవుటైతే ఏమనాలి బ్రో!
Recommended image3
RCB vs GT : నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ బాస్.. ప్లేఆఫ్స్‌లో రజత్ పాటీదార్ ఊచకోత చూశారా !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved