ధోనీ ఫార్ములాని ఫాలో అవుతున్న రోహిత్ శర్మ... టీ20 వరల్డ్ కప్‌లో దానిపైనే ఫోకస్...
ప్లేయర్‌గా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ రోహిత్ శర్మకు 8వది. 8 ఎడిషన్లుగా టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న ఇద్దరు ప్లేయర్లలో రోహిత్ కూడా ఒకడు. అయితే కెప్టెన్‌గా మొట్టమొదటిసారి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నాడు రోహిత్ శర్మ. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్, టీ20 వరల్డ్ కప్‌లో జట్టును ఎలా నడిపించబోతున్నాడు...
rohit sharma
2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు రోహిత్ శర్మ. అప్పటి నుంచి ప్రతీ టీ20 వరల్డ్ కప్‌లోనూ రోహిత్ శర్మ, టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు. యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో బ్యాటర్‌గా రోహిత్ ఫెయిల్యూర్, టీమిండియా విజయావకాశాలను దెబ్బ తీసింది..
Image credit: PTI
కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఏడాది బ్యాటర్‌గా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు రోహిత్ శర్మ. ఈ ఏడాది రెండు టెస్టుల్లో 90 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 6 వన్డేలు ఆడి 171 పరుగులు చేశాడు. 23 టీ20 మ్యాచులు ఆడి 540 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 2 హాఫ్ సెంచరీలు మాత్రమే చేయగలిగాడు... అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ‘వన్ మ్యాచ్ వన్ విన్’ ఫార్ములానే ఫాలో అవుతున్నాడట.
Rohit Sharma-Kane Williamson
‘టీమిండియా వరల్డ్ కప్ గెలిచి చాలా కాలమైంది. 15 ఏళ్ల మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో నేను కూడా ఉన్నా. ఆ మూమెంట్స్ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఈసారి వరల్డ్ కప్ గెలవాలనే లక్ష్యంతోనే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాం. ఆ విషయంలో ఎక్కడా తగ్గేది లేదు...
Image credit: PTI
అయితే వరల్డ్ కప్ గెలవాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. అది చాలా పెద్ద ప్రాసెస్. అందుకే ఒక్కో మ్యాచ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మా ఫోకస్ మొదటి మ్యాచ్ మీదే. అది గెలిచాక ఆ తర్వాతి మ్యాచ్ మీద. ఒక్కో అడుగు వేస్తూ లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నాం...
rohit sharma
మొదటి మ్యాచ్ కూడా ఆడకముందే సెమీస్ ఎలా గెలవాలి? ఫైనల్ ఎలా ఆడాలి? ఎవరితో ఆడాలని ఆలోచనలు చేయడం అత్యాశే అవుతుంది... అందుకే ఇప్పుడు మాకా ఆలోచనలు లేవు...’ అంటూ బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు రోహిత్ శర్మ...