- Home
- Sports
- Cricket
- టెస్టుల్లో రుతురాజ్ గైక్వాడ్‌కి ఛాన్స్... రంజీ ట్రోఫీకి అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా...
టెస్టుల్లో రుతురాజ్ గైక్వాడ్‌కి ఛాన్స్... రంజీ ట్రోఫీకి అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా...
వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడబోతున్న భారత జట్టు, ఆ సిరీస్ ముగిసిన తర్వాత శ్రీలంకతో టెస్టు, టీ20 సిరీస్ ఆడనుంది. స్వదేశంలో జరిగే ఈ టెస్టు సిరీస్‌లో కొన్ని ప్రయోగాలు చేయాలని భావిస్తోందట బీసీసీఐ...

ఆస్ట్రేలియా టూర్‌లో ఆరంగ్రేటం చేసి అదరగొట్టిన ఓపెనర్ శుబ్‌మన్ గిల్, వ్యక్తిగత కారణాలతో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కి దూరంగా ఉండబోతున్నాడు...
శుబ్‌మన్ గిల్ స్థానంలో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కి టెస్టుల్లో అవకాశం ఇవ్వాలని భావిస్తోందట బీసీసీఐ...
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచి, ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీలలో అదరగొట్టినా రుతురాజ్ గైక్వాడ్‌కి న్యూజిలాండ్, సౌతాఫ్రికా సిరీస్‌లలో అవకాశమే దక్కలేదు...
కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఉండడంతో రుతురాజ్ గైక్వాడ్‌ని టెస్టుల్లో మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచనలు చేస్తోందట బీసీసీఐ...
గత ఏడాది టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాలను శ్రీలంకతో టెస్టు సిరీస్‌కి దూరంగా పెట్టాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ప్రకటించాడు. ఈ ఇద్దరూ రంజీ ట్రోఫీలో పాల్గొని, ఫామ్‌ని తిరిగి నిరూపించుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలియవచ్చింది...
ఫిబ్రవరి 10 నుంచి రంజీ ట్రోఫీ 2022 సీజన్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభమయ్యే వరకూ ఫేజ్ 1 మ్యాచులు జరుగుతాయి. ఆ తర్వాత జూన్-జూలై మాసాల్లో ఫేజ్ 2 నిర్వహిస్తారు...
ఫేజ్ 1 మ్యాచుల్లో అజింకా రహానే, పూజారా రాణించి, తమ ఫామ్‌ను నిరూపించుకోగలిగితే ఇంగ్లాండ్‌లో జరిగే ఐదో టెస్టుకి ఎంపిక అవుతారు. లేదంటే లేదు...
అజింకా రహానే, పూజారా స్థానంలో శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హనుమ విహారి వంటి ప్లేయర్లను ఆడించాలని భావిస్తోంది బీసీసీఐ...
అలాగే విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో టీమిండియా తర్వాతి టెస్టు కెప్టెన్ ఎవరనే విషయంపై కూడా ఈ సిరీస్ నుంచి క్లారిటీ రానుంది...