శుబ్‌మన్ గిల్ కోలుకుంటున్నాడు! ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడొచ్చు... - కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభానికి ముందు సుప్రీమ్ ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. శుబ్‌మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతున్నాడని, మొదటి రెండు మ్యాచులకు అతను అందుబాటులో ఉండడం అనుమానమేనని ప్రచారం జరిగింది..
Shubman Gill-Rahul Dravid
ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ ఆరంభానికి ముందు ప్రెస్ మీట్‌లో ఈ విషయం గురించి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు..
‘శుబ్‌మన్ గిల్ రోజురోజుకీ వేగంగా కోలుకుంటున్నాడు. నిన్నటి కంటే ఈ రోజు అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది.. మెడికల్ టీమ్, అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది..’ అంటూ కామెంట్ చేశాడు రాహుల్ ద్రావిడ్..
తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దీనిపై స్పందించాడు. ‘వన్డే వరల్డ్ కప్ 2023 ఆరంభానికి ముందు టీమ్ అంతా మంచి మూడ్‌లో ఉంది. ఈ టోర్నమెంట్ కోసం చాలా బాగా ప్రిపేర్ అయ్యాం. అందరూ ఫిట్‌గా ఉన్నారు..
Shubman Gill Shreyas Iyer
శుబ్‌మన్ గిల్ 100 శాతం ఫిట్‌గా లేడు. అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అయితే అతనికి ఎలాంటి గాయం లేదు. అతని ఆరోగ్య పరిస్థితిని నిత్యం సమీక్షిస్తూనే ఉన్నాం... ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం ఉంది..
Rohit Sharma
అతను కుర్రాడు, వేగంగా కోలుకునేందుకు కావాల్సిన రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. కెప్టెన్ కంటే ముందు నేను ఓ మనిషిని. కాబట్టి అతను పూర్తిగా కోలుకోవడం కూడా నాకు ముఖ్యమే...
కెప్టెన్‌గా ఆలోచిస్తే, సూపర్ ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ని కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మ్యాచ్ మొదలయ్యేలోపు శుబ్‌మన్ గిల్ కోలుకుంటే, ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడతాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..