- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ ప్లేస్‌ని శుబ్‌మన్ గిల్ రిప్లేస్ చేయగలడా? అసలు సవాల్ అక్కడే మొదలవుతుంది...
విరాట్ కోహ్లీ ప్లేస్‌ని శుబ్‌మన్ గిల్ రిప్లేస్ చేయగలడా? అసలు సవాల్ అక్కడే మొదలవుతుంది...
ఓ కొత్త ప్లేయర్, ధనాధన్‌మని ఓ రెండు మూడు సెంచరీలు బాదితే చాలు... విరాట్ కోహ్లీతో పోల్చి చూడడం మొదలెట్టేస్తారు. ఎందుకంటే ఎన్ని విమర్శలు వచ్చినా ప్రస్తుత తరంలో బెస్ట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీయే. పాక్ ప్లేయర్లు ఫకార్ జమాన్, అహ్మద్ షాజద్, ఇప్పుడు బాబర్ ఆజమ్... కోహ్లీతో పోల్చబడినవాళ్లే. ఇప్పుడు ఈ లిస్టులోకి శుబ్‌మన్ గిల్ చేరిపోయాడు..

Image credit: PTI
2018 అండర్19 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన శుబ్‌మన్ గిల్, ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టెస్టుల్లో ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత వన్డేల్లో, తాజాగా టీ20ల్లోకి వచ్చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో సెంచరీ సాధించి, మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన అతి కొద్ది భారత బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు శుబ్‌మన్ గిల్..
ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న శుబ్‌మన్ గిల్, ఐపీఎల్ 2022 టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ టీమ్‌లోనూ ఉన్నాడు. న్యూజిలాండ్‌పై వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించి, అరుదైన ప్లేయర్ల జాబితాలో చేరిపోయాడు...
దీంతో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఆ ప్లేస్‌ని భర్తీ చేయగల సత్తా ఉన్న ప్లేయర్‌గా శుబ్‌మన్ గిల్‌ని చూస్తున్నారు కొందరు అభిమానులు. ఇప్పటికే విరాట్ కోహ్లీ ‘కింగ్’ అయితే, శుబ్‌మన్ గిల్ ‘ప్రిన్స్’ అంటూ ట్యాగ్‌లు కూడా జోడించేశారు...
Virat Kohli-Shubman Gill
సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియాకి అలాంటి ప్లేయర్ దొరుకుతాడా? అనే భయం, అనుమానం భారత క్రికెట్ ఫ్యాన్స్‌ని వెంటాడింది. అయితే విరాట్ కోహ్లీ అసాధారణ రీతిలో దూసుకొచ్చి, జెట్ స్పీడ్‌లో సచిన్ రికార్డులను బ్రేక్ చేస్తూ సాగుతున్నాడు...
Virat Kohli Comment on Gill
సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సవాళ్లను, మరెన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తూ ‘క్రికెట్ గాడ్’గా ఎదిగితే, విరాట్ కోహ్లీ కాలంతో మారిన క్రికెట్ నిబంధనలు, డీఆర్‌ఎస్ వంటి టెక్నాలజీలతో అంతో కొంతో లాభం పొందాడు. అందుకే సచిన్ స్థాయి వేరు. విరాట్ వీరత్వం వేరు. ఈ రెండింటినీ పోల్చి చూడకూడదని అంటారు మరికొందరు విశ్లేషకులు...
Shubman Gill
ఇప్పుడు శుబ్‌మన్ గిల్, టపీ టపీమని రెండు సెంచరీలు కొట్టేయగానే విరాట్ కోహ్లీ పోల్చి చూడడం కూడా ఇలాంటిదే. ఎందుకంటే శుబ్‌మన్ గిల్ ఇప్పటిదాకా ‘వారెవా!’ అనే రేంజ్‌లో ఆడిన ఇన్నింగ్స్‌ల్లో చాలా వరకూ స్వదేశంలో వచ్చినవే..
Image credit: PTI
ఆస్ట్రేలియా టూర్‌లో సిడ్నీ, గబ్బాలో ఆడిన ఇన్నింగ్స్‌లు మినహా ఇంగ్లాండ్ టూర్‌లో, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు శుబ్‌మన్ గిల్. న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి విదేశీ పిచ్‌ల మీద గిల్, ఇదే విధంగా అదరగొట్టగలడా?
Image credit: PTI
అన్నింటికీ మించి టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో విలువైన భాగస్వామ్యాలు నిర్మించి, విజయాలు అందించి... ‘మ్యాచ్ విన్నర్’గా, ‘ఛేజ్ మాస్టర్’గా మారాడు విరాట్ కోహ్లీ. మిగిలిన బ్యాటర్లను విరాట్‌తో వేరు చేసింది ఈ ప్రత్యేకతే...
Image credit: PTI
శుబ్‌మన్ గిల్, ఇలా చేయగలడా? స్వదేశంలో పరిస్థితులు అనుకూలించినప్పుడు సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదడం వేరు... టీమ్ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు అదిరిపోయే ఇన్నింగ్స్‌లు ఆడడం వేరు. అలాంటి సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే శుబ్‌మన్ గిల్, విరాట్ రేంజ్‌ని చేరతాడు..