- Home
- Sports
- Cricket
- టెస్టులకు రోహిత్ దూరం! శుబ్‌మన్ గిల్‌తో రాహుల్ ఓపెనింగ్... షమీ ప్లేస్‌లో ఉమ్రాన్ మాలిక్!...
టెస్టులకు రోహిత్ దూరం! శుబ్‌మన్ గిల్‌తో రాహుల్ ఓపెనింగ్... షమీ ప్లేస్‌లో ఉమ్రాన్ మాలిక్!...
బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియాకి ఏదీ కలిసి రావడం లేదు. తొలి వన్డేలో ఆఖరి వికెట్ తీయలేక పరాజయం పాలైంది భారత జట్టు. రెండో వన్డేలో విజయానికి 5 పరుగుల దూరంలో వచ్చి ఆగిపోయింది. అదీగాక రెండు వన్డేల గ్యాప్‌లో ఏకంగా నలుగురు ప్లేయర్లు గాయాలతో జట్టుకి దూరమయ్యారు...

Mohammed Shami
వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడిన మహ్మద్ షమీ... వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. టెస్టు సిరీస్‌లో కూడా షమీ ఆడడం అనుమానంగా మారింది. జస్ప్రిత్ బుమ్రా కూడా లేకపోవడంతో మహ్మద్ షమీ ప్లేస్‌ని రిప్లేస్ చేసే బౌలర్ కోసం వెతుకుతోంది భారత జట్టు...
తాజాగా రెండో వన్డేలో కుల్దీప్ సేన్, దీపక్ చాహార్, రోహిత్ శర్మ గాయపడ్డారు. దీపక్ చాహార్ తొడ కండరాలు పట్టేయడంతో కోలుకోవడానికి కనీసం రెండు మూడు వారాల సమయం పడుతుంది. రోహిత్ శర్మ గాయపడడంతో మరోసారి స్టార్ ఓపెనర్ లేకుండానే టెస్టు సిరీస్ ఆడబోతోంది భారత జట్టు...
2021 ఏడాది చివర్లో సౌతాఫ్రికా పర్యటనకు ముందు రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకున్నాడు. ఈ పర్యటనలో సెంచూరియన్ టెస్టు గెలిచిన టీమిండియా, ఆ తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో ఓడింది. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు ఆరంభానికి ముందు కూడా రోహిత్ గాయపడ్డాడు...
Image credit: Getty
రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రిత్ బుమ్రా టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో చిత్తుగా ఓడింది భారత జట్టు. టెస్టు సిరీస్‌ని 2-2 తేడాతో సమం చేసి, టీమిండియా ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్సులను తగ్గించేసింది ఇంగ్లాండ్...
రోహిత్ శర్మ, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొనడం అనుమానంగా మారడంతో శుబ్‌మన్ గిల్‌తో కలిసి కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందుజాగ్రత్తగా రోహిత్ శర్మకు రిప్లేస్‌మెంట్‌గా అభిమన్యు ఈశ్వరన్‌కి పిలుపు ఇవ్వనుంది బీసీసీఐ...
Image credit: Getty
బంగ్లాదేశ్ ఏ టీమ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రెండు వరుస సెంచరీలు చేసి సెలక్టర్లను మెప్పించాడు అభిమన్యు ఈశ్వరన్. రెండేళ్ల క్రితమే టీమిండియాకి ఎంపికైన ఈశ్వరన్, ఇప్పటిదాకా అంతర్జాతీయ ఆరంగ్రేటం మాత్రం చేయలేకపోయాడు...
మహ్మద్ షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ లేదంటే ముకేశ్ కుమార్ చౌదరీలను ఆడించాలనే ఆలోచనలో ఉంది టీమిండియా. న్యూజిలాండ్ పర్యటనలో వన్డే ఆరంగ్రేటం చేసిన ఉమ్రాన్ మాలిక్, మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. అలాగే ఐపీఎల్‌లో అదరగొట్టిన ముకేశ్ కుమార్ చౌదరి, దేశవాళీ టోర్నీల్లోనూ నిలకడైన ప్రదర్శన ఇచ్చాడు...
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కి రవీంద్ర జడేజా కూడా ఎంపికయ్యాడు. గాయం నుంచి కోలుకోని కారణంగా వన్డే సిరీస్‌కి దూరమైన రవీంద్ర జడేజా, టెస్టు సిరీస్ సమయానికి అందుబాటులో ఉంటాడా? అనేది అనుమానంగా మారింది. జడ్డూ కోలుకోకపోతే సౌరబ్ కుమార్‌కి అవకాశం దక్కొచ్చు...