MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఊర్వశి ఇదంతా ఎందుకు చేస్తుందో రిషబ్‌ పంత్‌కి బాగా తెలుసు... శుబ్‌మన్ గిల్ కామెంట్స్..

ఊర్వశి ఇదంతా ఎందుకు చేస్తుందో రిషబ్‌ పంత్‌కి బాగా తెలుసు... శుబ్‌మన్ గిల్ కామెంట్స్..

బాలీవుడ్‌లో ఎంతగా అందాలు ఆరబోసినా వార్తల్లో నిలవడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ నిండుగా కప్పుకుని ఉండేవారి కంటే, వార్తల్లో నిలిచేందుకు పొట్టి పొట్టి దుస్తుల్లో అందాలు బయటపెట్టేవాళ్లే ఎక్కువ. అందుకే ఊర్వశి రౌతెల్లా మరో రూటు ఎంచుకుంది. అదే రిషబ్ పంత్‌తో రిలేషన్... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 24 2022, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఊర్వశి రౌతెల్లా తన నటన ద్వారా ఎంత మంది ఫాలోవర్లను సంపాదించుకుందో తెలీదు కానీ క్రికెటర్ రిషబ్ పంత్‌తో గొడవతో సోషల్ మీడియాలో కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంది. భారత క్రికెటర్ రిషబ్ పంత్ తనకోసం వారణాసి వచ్చి 10 గంటల పాటు హోటల్ లాబీలో వెయిట్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది ఊర్వశి..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

వీరిద్దరి మధ్య ఏం జరిగిందీ ఎవ్వరికీ తెలీదు కానీ ఒకప్పుడు రిషబ్ పంత్, ఊర్వశి రౌతెల్లా పీకల్లోతు ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జోరుగా సాుగతున్న సమయంలోనే ఊర్వశి రౌతెల్లాని సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడు క్రికెటర్ రిషబ్ పంత్. 

37

అయితే ఊర్వశి మాత్రం రిషబ్ పంత్‌పై తనకున్న ప్రేమను సాధ్యమైనప్పుడల్లా బయటపెడుతూనే వచ్చింది. ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు  ఓ ఇంటర్వ్యూలో ‘మిస్టర్ ఆర్‌పీ’ అంటూ ఊర్వశి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి...

47

అనుకోకుండా తన గురించి దేశమంతా చర్చ జరుగుతుండడంతో ఈ ఎపిసోడ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెంచుతూ పోయింది ఊర్వశి రౌతెల్లా.  తన ప్రేమను అనుసరిస్తూ ఆస్ట్రేలియా వెళ్తున్నట్టు ఊర్వశి రౌతెల్లా చేసిన పోస్టు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులు ‘మిస్టర్ ఆర్‌పీ’ అంటూ రామ్ పోతినేనితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ఊర్వశి..

57
Shubman Gill, Rishabh Pant, Urvashi Rautela

Shubman Gill, Rishabh Pant, Urvashi Rautela

తాజాగా భారత క్రికెటర్ శుబ్‌మన్ గిల్, ఊర్వశి రౌతెల్లా ఎపిసోడ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ‘జనాలు, ఊర్వశి పేరు చెప్పి రిషబ్ పంత్‌ని ఏడిపిస్తూ ఉంటారు. మరి డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఇలాగే చేస్తారా?’ అంటూ సోనమ్ భజ్వా, శుబ్‌మన్ గిల్‌ని ప్రశ్నించింది..

67
Rishabh Pant-Urvashi Rautela

Rishabh Pant-Urvashi Rautela

‘ఊర్వశి ఇదంతా చేస్తుందో దీని కోసం. తన పేరు చెప్పి రిషబ్ పంత్‌ని ఏడిపించాలని, డిస్టర్బ్ చేయాలని కోరుకుంటోంది. ఎలాగైనా జనాల అటెన్షన్ దక్కించుకోవాలనేది తన ఆరాటం. రిషబ్ పంత్‌ ఆమెను అస్సలు పట్టించుకోడు. ఊర్వశి ఎందుకిలా చేస్తుందో రిషబ్‌కి బాగా తెలుసు..’ అంటూ కామెంట్ చేశాడు శుబ్‌మన్ గిల్.

77
Rishabh Pant vs Urvashi Rautela

Rishabh Pant vs Urvashi Rautela

కొన్నిరోజుల క్రితం కొందరు జనాల అటెన్షన్ దక్కించుకోవడానికి ఎంతకైనా దిగజారుతారు అంటూ ఊర్వశి రౌతెల్లా గురించి ఇన్‌స్టా స్టోరీ పోస్ట్ చేశాడు రిషబ్ పంత్. తాజాగా శుబ్‌మన్ గిల్ కూడా ఊర్వశిని ‘అటెన్షన్ సీకర్’ అంటూ తేల్చి పడేశాడు... 
 

About the Author

CR
Chinthakindhi Ramu
రిషబ్ పంత్
శుభ్‌మన్ గిల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved