MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • సచిన్ రికార్దు బద్దలుకొట్టిన శుభ్‌మన్ గిల్.. ధోనికి షాక్ !

సచిన్ రికార్దు బద్దలుకొట్టిన శుభ్‌మన్ గిల్.. ధోనికి షాక్ !

Shubman Gill: భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెస్టిండీస్ పై అద్భుతమైన ఆటతో సెంచరీ కొట్టాడు. ఈ సెంచరీ నాక్ తో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టాడు. అలాగే, ధోనీ రికార్డును సమం చేశాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 11 2025, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
10వ టెస్టు సెంచరీ కొట్టిన శుభ్ మన్ గిల్
Image Credit : Insta/indiancricketteam

10వ టెస్టు సెంచరీ కొట్టిన శుభ్ మన్ గిల్

భారత్-వెస్టిండీస్ మధ్య ఢిల్లీ లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఆటతో ఆదరగొట్టాడు. సూపర్ బ్యాటింగ్ తో తన టెస్ట్ కెరీర్‌లో 10వ సెంచరీని సాధించాడు. కెప్టెన్‌గా ఇది ఆయనకు 5వ సెంచరీ కావడం విశేషం. 129* పరుగుల సెంచరీ నాక్ లో 16 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. టెస్ట్ కెప్టెన్‌గా మారిన తర్వాత గిల్ మరింత ప్రభావవంతమైన ఇన్నింగ్స్ లతో పరుగుల వరద పారిస్తున్నాడు.

గిల్ ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్ టూర్‌కు ముందు భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీని గిల్ కు అప్పగించారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2–2తో డ్రా అయింది. అయినప్పటికీ గిల్ వ్యక్తిగతంగా అద్భుతంగా ఆడాడు. సూపర్ ఫామ్ తో పరుగుల సునామీ రేపాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కెప్టెన్‌గా గిల్ అద్భుత బ్యాటింగ్
Image Credit : AFP

కెప్టెన్‌గా గిల్ అద్భుత బ్యాటింగ్

గిల్ ఇప్పటివరకు కెప్టెన్‌గా 7 టెస్ట్ మ్యాచ్‌లలో 12 ఇన్నింగ్స్‌లు ఆడి, 84.81 సగటుతో 933 పరుగులు చేశాడు. వీటిలో ఒక డబుల్ సెంచరీ, ఐదు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇందులో అత్యధిక స్కోరు 269 పరుగులు. 2025 జూలైలో ఇంగ్లాండ్‌తో జరిగిన బర్మింగ్హామ్ టెస్ట్‌లో ఈ పరుగులు సాధించాడు. ఈ ఏడాదిలోనే గిల్ 5 సెంచరీలు సాధించడం విశేషం. వెస్టిండీస్ పై సాధించిన సెంచరీతో గిల్‌ రెండు పెద్ద రికార్డులు సాధించాడు.

Related Articles

Related image1
విరాట్ కోహ్లీ vs రోహిత్ శర్మ : ఎవరు బాగా రిచ్?
Related image2
హార్దిక్ పాండ్యా కొత్త లవ్ స్టోరీ.. ఢిల్లీ మోడల్ మహీకా శర్మతో చక్కర్లు !
35
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన గిల్
Image Credit : @BCCI/X

సచిన్ రికార్డును బ్రేక్ చేసిన గిల్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 1997లో కెప్టెన్‌గా 17 ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు సాధించాడు. ఆ రికార్డును ఇప్పుడు గిల్ బద్దలుకొట్టాడు. కెప్టెన్‌గా ఆయన ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు సాధించాడు. ఇది కేవలం రికార్డ్ బద్దలుకొట్టడం మాత్రమే కాదు.. భారత టెస్ట్ కెప్టెన్‌గా కొత్త రికార్డుల మోత మోగిస్తున్నాడు. యంగ్ ఇండియాను ముందుకు నడిపిస్తున్నాడు.

45
ధోనీ రికార్డును సమం చేసిన శుభ్‌మన్ గిల్
Image Credit : Getty

ధోనీ రికార్డును సమం చేసిన శుభ్‌మన్ గిల్

గిల్‌ ఈ సెంచరీతో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు. ధోనీ కూడా తన టెస్ట్ కెప్టెన్ కెరీర్‌లో 5 సెంచరీలు సాధించాడు. ఈ ఘనతతో గిల్, ధోనీతో పాటు సౌరవ్ గాంగూలీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ లాంటి దిగ్గజాల సరసన చేరాడు.

ఇక కెప్టెన్‌గా గిల్ ఇప్పటికే రోహిత్ శర్మను కూడా వెనక్కి నెట్టాడు. రోహిత్ కెప్టెన్‌గా నాలుగు సెంచరీలు మాత్రమే సాధించగా, గిల్ ఐదు సాధించాడు.

55
భారత కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్లు
Image Credit : ANI

భారత కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్లు

  1. విరాట్ కోహ్లీ – 20 సెంచరీలు
  2. సునీల్ గవాస్కర్ – 11 సెంచరీలు
  3. మొహమ్మద్ అజరుద్దీన్ – 9 సెంచరీలు
  4. సచిన్ టెండూల్కర్ – 7 సెంచరీలు
  5. శుభ్‌మన్ గిల్ – 5 సెంచరీలు
  6. మహేంద్ర సింగ్ ధోనీ – 5 సెంచరీలు
  7. సౌరవ్ గాంగూలీ – 5 సెంచరీలు

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
విరాట్ కోహ్లీ vs రోహిత్ శర్మ : ఎవరు బాగా రిచ్?
Recommended image2
హార్దిక్ పాండ్యా కొత్త లవ్ స్టోరీ.. ఢిల్లీ మోడల్ మహీకా శర్మతో చక్కర్లు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved