MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • Maruti Suzuki: మారుతి సుజుకి మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్.. కార్లపై రూ. 2.15 లక్షల దాకా డిస్కౌంట్

Maruti Suzuki: మారుతి సుజుకి మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్.. కార్లపై రూ. 2.15 లక్షల దాకా డిస్కౌంట్

Maruti Suzuki: కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకి అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. జూన్ నెలలో నెక్సా, అరేనా మోడల్స్‌పై రూ. 2.15 లక్షల వరకు భారీ ఆఫర్లను ప్రకటిస్తూ కార్ల లవర్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 06 2026, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మారుతి సుజుకి జూన్ ధమాకా ఆఫర్లు
Image Credit : Gemini

మారుతి సుజుకి జూన్ ధమాకా ఆఫర్లు

మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది నిజంగానే క్రేజీ న్యూస్.. ఇండియా లీడింగ్ కార్ మేకర్ మారుతి సుజుకి తన కస్టమర్ల కోసం జూన్ నెలలో కళ్ళు చెదిరే ఆఫర్లను తీసుకొచ్చింది. తన ప్రీమియం నెట్‌వర్క్ నెక్సా తో పాటు, మాస్ మార్కెట్ సిరీస్ అరేనా కార్లపై రూ. 2.15 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను అనౌన్స్ చేసింది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, కార్పొరేట్ ఆఫర్లతో పాటు గ్రామీణ ప్రాంత కస్టమర్ల కోసం స్పెషల్ బెనిఫిట్స్‌ను కూడా జూన్ 2 నుంచి జూన్ 30 వరకు అందుబాటులో ఉంచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నెక్సా టాప్ మోడల్స్: ఇన్విక్టో, గ్రాండ్ విటారాపై భారీగా తగ్గిన ధరలు
Image Credit : our own

నెక్సా టాప్ మోడల్స్: ఇన్విక్టో, గ్రాండ్ విటారాపై భారీగా తగ్గిన ధరలు

జూన్ నెల ఆఫర్ల లిస్టులో నెక్సాకు చెందిన ప్రీమియం ఎమ్‌పీవీ ఇన్విక్టో రూ. 2.15 లక్షల వరకు బెనిఫిట్స్‌తో టాప్‌లో నిలిచింది. ఇకపోతే అందరి ఫేవరెట్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా పై కూడా ఆఫర్లు మామూలుగా లేవు. దీని ఎంట్రీ లెవెల్ సిగ్మా పెట్రోల్ వేరియంట్‌పై రూ. 1.35 లక్షలు, డెల్టా పెట్రోల్ వేరియంట్‌లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు ఉంది.

జీటా, ఆల్ఫా వేరియంట్లకు రూ. 85 వేల బెనిఫిట్స్‌తో పాటు 5 ఇయర్స్ కాంప్లిమెంటరీ ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఢిల్లీలో గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 1.85 లక్షల వరకు జీరో రోడ్ టాక్స్ బెనిఫిట్‌తో పాటు అదనంగా రూ. 90 వేల డిస్కౌంట్ లభిస్తుంది.

Related Articles

Related image1
WhatsApp e Challan: వాహనదారులకు అలర్ట్.. వాట్సాప్‌లోనే ట్రాఫిక్ చలాన్లు.. 30 రోజుల్లో ఆ పని చేయకపోతే లైసెన్స్ కట్ !
Related image2
Mobile Photography Tips: ఇన్ స్టాలో లైకుల వర్షం గ్యారెంటీ.. నార్మల్ ఫోన్‌లోనే ప్రొఫెషనల్ ఫోటోలు తీసే 5 మైండ్ బ్లోయింగ్ టిప్స్
36
నెక్సా హ్యాచ్‌బ్యాక్స్, ఎస్‌యూవీలు: బాలెనో, ఫ్రాంక్స్, జిమ్నీలపై క్రేజీ డీల్స్
Image Credit : Asianet News

నెక్సా హ్యాచ్‌బ్యాక్స్, ఎస్‌యూవీలు: బాలెనో, ఫ్రాంక్స్, జిమ్నీలపై క్రేజీ డీల్స్

నెక్సా కార్లలో పాపులర్ అయిన బాలెనో పెట్రోల్, ఆటోమేటిక్ వేరియంట్లపై రూ. 40 వేలు, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ. 35 వేల వరకు ఆఫర్లు ఉన్నాయి. ప్రొడక్షన్ ఆగిపోయిన ఇగ్నిస్ మోడల్ మిగిలివున్న డీలర్ స్టాక్‌పై రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

స్టైలిష్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ టర్బో-పెట్రోల్ వేరియంట్‌పై రూ. 25 వేలు, నార్మల్ పెట్రోల్, సీఎన్‌జీలపై రూ. 15 వేల తగ్గింపు ఉంది. లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ జిమ్నీ, XL6 మోడల్స్‌పై అన్ని వేరియంట్లకు రూ. 45 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.

46
అరేనా షోరూమ్ ఆఫర్స్: విక్టోరిస్, బ్రెజ్జా వేరియంట్లపై భారీ డిస్కౌంట్లు
Image Credit : maruti suzuki

అరేనా షోరూమ్ ఆఫర్స్: విక్టోరిస్, బ్రెజ్జా వేరియంట్లపై భారీ డిస్కౌంట్లు

ఇక అరేనా నెట్‌వర్క్ కార్ల విషయానికి వస్తే, ఫ్లాగ్‌షిప్ మోడల్ విక్టోరిస్ పై అత్యధిక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్‌పై రూ. 90 వేలు, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ. 80 వేలు, పెట్రోల్ వేరియంట్‌పై రూ. 60 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. త్వరలోనే సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో రాబోతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజ్జా పెట్రోల్, సీఎన్‌జీ మోడల్స్ అన్నింటిపై రూ. 55 వేల వరకు భారీ తగ్గింపును అందిస్తున్నారు.

56
బడ్జెట్ కార్ల హంగామా: ఆల్టో, వాగన్ఆర్, స్విఫ్ట్‌లపై సూపర్ డిస్కౌంట్లు
Image Credit : stockPhoto

బడ్జెట్ కార్ల హంగామా: ఆల్టో, వాగన్ఆర్, స్విఫ్ట్‌లపై సూపర్ డిస్కౌంట్లు

మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఇష్టపడే బడ్జెట్ కార్లపై కూడా మారుతి సుజుకి ఆఫర్ల వర్షం కురిపించింది.

• ఆల్టో K10: ఎల్‌ఎక్స్‌ఐ వేరియంట్‌పై రూ. 52,500.. మిగిలిన వేరియంట్లపై రూ. 42,500 వరకు ఆఫర్స్ ఉన్నాయి.

• వాగన్ఆర్: మోస్ట్ పాపులర్ టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 52,500 వరకు తగ్గింపు.

• స్విఫ్ట్: కొత్త స్విఫ్ట్ మాన్యువల్, సీఎన్‌జీలపై రూ. 40 వేలు, ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ. 45 వేల బెనిఫిట్స్ ఉన్నాయి.

• S-ప్రెస్సో, సెలెరియో: పెట్రోల్, సీఎన్‌జీ మోడల్స్ రెండింటిపై రూ. 37,500 వరకు ఆఫర్లు ఉన్నాయి.

66
మీ లొకేషన్ లో ముందు చెక్ చేయండి
Image Credit : stockPhoto

మీ లొకేషన్ లో ముందు చెక్ చేయండి

ఈ ధరలు, ఆఫర్లు అనేవి మీరు ఎంచుకునే లొకేషన్, వేరియంట్, స్టాక్ లభ్యతను బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు మీ దగ్గరలోని మారుతి సుజుకి లేదా నెక్సా డీలర్‌షిప్‌ను సంప్రదించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం మంచిది. ప్రస్తుతం మారుతి అరేనా కార్ల ప్రారంభ ధర రూ. 3.70 లక్షలుగా ఉండగా, నెక్సా రేంజ్ రూ. 5.99 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 20.01 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Cheapest Tesla EV India: ఇండియాలోకి టెస్లా చీపెస్ట్ ఈవీ కార్.. సింగిల్ ఛార్జ్‌తో 500 కిలోమీటర్ల మైలేజ్.. అదిరిపోయే ఫీచర్లు!
Recommended image2
Budget Car: దేశంలో అత్యంత చ‌వ‌కైన 7 సీట‌ర్ కారు ఇదే.. ఫీచ‌ర్లు కూడా సూప‌ర్
Recommended image3
తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్.. భారత్‌లో అత్యంత చౌకైన 5 CNG కార్లు ఇవే
Related Stories
Recommended image1
WhatsApp e Challan: వాహనదారులకు అలర్ట్.. వాట్సాప్‌లోనే ట్రాఫిక్ చలాన్లు.. 30 రోజుల్లో ఆ పని చేయకపోతే లైసెన్స్ కట్ !
Recommended image2
Mobile Photography Tips: ఇన్ స్టాలో లైకుల వర్షం గ్యారెంటీ.. నార్మల్ ఫోన్‌లోనే ప్రొఫెషనల్ ఫోటోలు తీసే 5 మైండ్ బ్లోయింగ్ టిప్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved