శ్రేయస్ అయ్యర్ కు షూస్.. కోహ్లికి వాచెస్.. ఐపీఎల్ స్టార్ల హాబీలేమిటో తెలుసా..?
TATA IPL 2022: మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న ఐపీఎల్ లో ముంబై, చెన్నై మినహా మిగిలిన జట్లు అంచనాలకు మించి రాణిస్తున్నాయి. అయితే కోల్కతా సారథి శ్రేయస్ అయ్యర్ నుంచి గుజరాత్ సారథి హార్ధిక్ పాండ్యా వరకు వారి హాబీలేంటో తెలుసా..?

సాధారణంగా కొంతమందికి స్టాంప్స్ కలెక్షన్, పురాతన వస్తువులను సేకరించడం హాబీ గా ఉంటుంది. ఏ ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉండాలన్న నియమం లేదు. మరి మన ఐపీఎల్ టాప్ స్టార్ల అభిరుచులేంటో ఇక్కడ చూద్దాం.
1. శ్రేయస్ అయ్యర్ : కోల్కతా నైట్ రైడర్స్ సారథి శ్రేయస్ అయ్యర్ కు స్నీకర్స్ (షూస్) అంటే చాలా ఇష్టం. అతడి దగ్గర ఓ 50 రకాల స్నీకర్స్ ఉన్నాయట. మూడ్, వెళ్లే ప్రదేశాన్ని బట్టి అయ్యర్ షూస్ మారుస్తాడట. నైకీ, ఏయిర్ జోర్డాన్స్, ఏయిర్ మ్యాక్స్, పూమా వంటి అంతర్జాతీయ బ్రాండ్లెన్నో అయ్యర్ దగ్గర ఉన్నాయట.
ఎయిర్ పోర్టుకు వెళ్లినా.. మ్యాచ్ ఆడటానికి వెళ్లినా.. ఏదైనా పార్టీకో లేక ఫంక్షన్ కో వెళ్లినా.. సందర్భానికి తగ్గ షూస్ ధరించి అక్కడికి వెళ్లడం మనోడికి ఇష్టమట.
2. విరాట్ కోహ్లి : టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి లగ్జరీ వాచ్ లంటే మక్కువ ఎక్కువ. రొలెక్స్ డేటోనా రేయిన్బో ఎవరోస్ గోల్డ్ (సుమారు రూ. 90 లక్షలు) వంటి ఖరీదైన వాచ్ కోహ్లి దగ్గరుంది. ఒక్క రోలెక్సే కాదు.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాచ్ లను సేకరించడం కూడా విరాట్ అభిరుచిలో ఒకటి.
3. రోహిత్ శర్మ : టీమిండియా సారథి రోహిత్ శర్మకు కార్లంటే ఆసక్తి ఎక్కువ. ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ దగ్గర ఇప్పటికే BMW M5, Toyota Fortuner, Mercedes GLS 350d, BMW M5, Lamborghini Urus, and BMW X3 వంటి కార్లున్నాయి. ఇందులో లంబోర్ఘిని ఉరుస్ ను టీమిండియా సారథి అయ్యాక కొనుగోలు చేశాడు. దానిని తనకు తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నాడు. మరిన్ని లగ్జరీ కార్లను కొనడానికి హిట్ మ్యాన్ సిద్ధంగా ఉన్నాడట.
4. హార్ధిక్ పాండ్యా : గుజరాత్ టైటాన్స్ సారథి హార్ధిక్ కు కూడా రోహిత్, విరాట్ మాదిరిగానే కార్లు, వాచీల మీద ఇష్టెమెక్కువ. స్పోర్ట్స్ కార్లను ఎక్కువ గా ఇష్టపడే పాండ్యా దగ్గర అత్యంత ఖరీదైన Mercedes G63 AMG and Range Rover, Lamborghini Huracan Evo బ్రాండ్లు ఉన్నాయి.
వీటితో పాటే ఖరీదైన వాచీలను కూడా హార్ధిక్ కొనుగోలు చేస్తాడు. దుబాయ్, ఇంగ్లాండ్ వంటి దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ అత్యంత ఖరీదైన వాచీలను కొనడానికి ఏమాత్రం వెనుకాడడు. ఇటీవలే దుబాయ్ లో టీ20 ప్రపంచకప్ ముగిశాక అతడు తీసుకొచ్చిన ఓ వాచీ పత్రాలకు సంబంధించి ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు కూడా పలు తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే. పాండ్యా దగ్గర కోటి రూపాయల విలువ చేసే Rolex Oyster Perpetual Daytona Cosmograph వాచ్ ఉంది.
5. దినేశ్ కార్తీక్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు దినేశ్ కార్తీక్ కు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలలో పెట్టుబడులు పెట్టడం అంటే ఇష్టమట. ఇంటీరియర్ డిజైన్స్, ప్రాపర్టీస్ పై కార్తీక్ ఎక్కువ ఖర్చు పెడతాడు. చెన్నైలో కోటి రూపాయల విలువ చేసే ఇంటిని తనకు నచ్చినట్టుగా కట్టుకున్నాడు కార్తీక్.