ఏబీ డివిల్లియర్స్ కంటే సూర్యకుమార్ యాదవ్ బెస్ట్! ఎందుకంటే? షోయబ్ అక్తర్ కామెంట్...
క్రికెట్ వరల్డ్‌లో గ్రౌండ్‌కి అన్ని వైపులా ఆడుతూ ‘మిస్టర్ 360 డిగ్రీస్’గా పేరు తెచ్చుకున్న ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్. ఈ సౌతాఫ్రికా లెజెండరీ బ్యాటర్ తిరుగులేని రికార్డులెన్నో క్రియేట్ చేసిన ఏబీ డివిల్లియర్స్, తన కెరీర్‌లో ఐసీసీ టైటిల్ కానీ ఐపీఎల్ టైటిల్ కానీ గెలవలేకపోయాడు...

AB de Villiers-Suryakumar Yadav
ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున మూడు సీజన్లు ఆడి, ఆర్‌సీబీకి మారాడు ఏబీ డివిల్లియర్స్. 2011 నుంచి 11 సీజన్ల పాటు ఆర్‌సీబీకి ఆడిన ఏబీ డివిల్లియర్స్, ఐపీఎల్‌లో 5 వేలకు పైగా పరుగులు చేసిన అతికొద్ది మంది ప్లేయర్లలో ఒకడు...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వహించిన ఆఖరి సీజన్ 2021తో ఏబీ డివిల్లియర్స్, ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఏబీ డివిల్లియర్స్, త్వరలో ప్రారంభం కాబోయే సౌతాఫ్రికా20 లీగ్‌లో కామెంటేటర్‌గా ఆరంగ్రేటం చేయబోతున్నాడు...
suryakumar
ఏబీ డివిల్లియర్స్ స్టైల్ ఆటతీరుతో ‘ఇండియన్ ఏబీడీ’, ‘ఇండియన్ మిస్టర్ 360’గా గుర్తింపు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్, అంతర్జాతీయ క్రికెట్‌లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చినా తనదైన ముద్ర వేస్తున్నాడు. 2022 ఏడాదిలో రెండు టీ20 సెంచరీలు చేసిన సూర్యకుమార్ యాదవ్, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్నాడు...
AB De Villiers
ఏబీ డివిల్లియర్స్ మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తే, సూర్యకుమార్ యాదవ్ ఇంకా టెస్టు ఎంట్రీ ఇవ్వలేదు. ఈ ఇద్దరినీ పోల్చి చూడడం కరెక్ట్ కాదు కూడా. అయితే పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాత్రం ఏబీడీ కంటే సూర్య టాప్ ప్లేయర్ అంటున్నాడు...
Image credit: PTI
‘టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్లు అవసరం. పాక్‌లో అలాంటి బ్యాటర్లు వెతికినా కనిపించరు. 130-140 స్ట్రైయిక్ రేటుతో బ్యాటింగ్ చేస్తే చాలు, ఆహా! ఓహో... అనుకుంటారు మా వాళ్లు. 180+ స్ట్రైయిక్ రేటుతో బ్యాటింగ్ చేయడం వారికి కలగానే మిగిలుతుంది...
AB de Villiers
నా ఉద్దేశంలో ఏబీ డివిల్లియర్స్ కంటే సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ ప్లేయర్. ఏబీ క్లాస్ ప్లేయర్ కాదనను. అయితే సూర్యకుమార్ యాదవ్ ఫియర్‌లెస్ ప్లేయర్. బౌలర్ ఎవ్వరనేది పట్టించుకోకుండా తన స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తాడు. అందుకే నూరుశాతం సూర్యకే నేను ఓటేస్తాను...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్..