- Home
- Sports
- Cricket
- కావాలనే స్టీవ్ వా కాళ్లను తన్నాను, ఆ అంపైర్‌ని కూడా చంపాలనుకున్నా!... - షోయబ్ అక్తర్
కావాలనే స్టీవ్ వా కాళ్లను తన్నాను, ఆ అంపైర్‌ని కూడా చంపాలనుకున్నా!... - షోయబ్ అక్తర్
క్రికెట్ ప్రపంచంలో ఫాస్ట్ బౌలింగ్ విషయంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఓ లెజెండ్. అయితే తనకున్న టాలెంట్‌కి సాధించాల్సిన దాంట్లో 10 శాతం కూడా చేయలేకపోయాడు అక్తర్. కారణం కెరీర్ ఆసాంతం వేధించిన గాయాలతో పాటు వివాదాలు, తన దురుసు ప్రవర్తన, తలబిగుసు, పొగరు, ఎక్సెట్రా...

ఆట అంటే పోటీ, అంతేకాని వైరం కాదు. అయితే పాకిస్తాన్ క్రికెటర్లు మాత్రం ప్రత్యర్థి ప్లేయర్లను శత్రువుల్లా చూసేవాళ్లు... ప్రత్యర్థి ప్లేయర్లతో గొడవలు పెట్టుకోవడం పాకిస్తాన్ క్రికెటర్లకు బాగా అలవాటు. అలాంటి వారిలో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ముందు వరుసలో ఉంటాడు...
తన కెరీర్‌లో భారత ప్లేయర్లతో పాటు ఎంతో మంది విదేశీ క్రికెటర్లతో తగువులాడి వివాదాలతో కెరీర్‌ని నాశనం చేసుకున్న షోయబ్ అక్తర్, తన తోటి టీమ్‌మేట్స్‌తోనూ గొడవలు పడి శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే...
2006లో ఫైసలాబాద్‌లో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఎమ్మెస్ ధోనీకి కావాలని బీమర్లు వేశానని కామెంట్ చేసిన షోయబ్ అక్తర్, తాజాగా తన కెరీర్‌లో అత్యంత వివాదాస్పదమైన 1999 వరల్డ్ కప్ మ్యాచ్ గురించి బయటపెట్టాడు...
Shoaib Akhtar
‘నా కెరీర్‌లో దాదాపు 30-40 సార్లు అంపైర్లను ఛాతిపైన బలంగా కొట్టాలని అనుకున్నా. బ్యాటుతో బ్యాట్స్‌మెన్ తల పగలకొట్టాలని అనుకున్నా... బౌలింగ్ చేసే సమయంలో నాలో అంత కోపం, కసి ఉండేవి...
1999 వరల్డ్ కప్ సమయంలో స్టీవ్ వా ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. అయితే అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. నాకు పట్టలేనంత కోపం వచ్చింది. అందుకే వెళ్లి అతని కాలిని తన్నాను...
అతను సింగిల్ కోసం పరుగెత్తుతున్నాడు. నేను కావాలని అతనికి అడ్డుగా వచ్చి డాష్ ఇచ్చాను. నేను అతనితో చాలా కర్కశంగా వ్యవహరించాను. అయితే అతను చాలా గొప్ప ప్లేయర్...
అయితే అప్పుడు మ్యాచ్ ఉన్న పరిస్థితుల్లో పట్టలేనంత కోపం వచ్చింది. ‘నువ్వు సిగ్గుపడు, అవుట్ అయిపోయినా ఆడుతున్నావ్...’ అని స్టీవ్ వాతో అన్నాను..
ఆ తర్వాత స్టీవ్ వా నా బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాను. అతనివైపు కోపంగా చూస్తూ ‘ఏంటి పడుకున్నావా...’ అన్నాను. దానికి కూడా అతనేమీ అనకుండానే పెవిలియన్‌కి వెళ్లాను..
నేను ఆ సమయంలో స్టీవ్ వాని చితక్కొట్టి, తినేయాలనేంత కోపంతో ఉన్నా. ఇప్పుడు ఆ సంఘటన గురించి చెబుతుంటే కూడా నాకు కోపం వస్తుంది. నాకు అధికారులపైన, ప్లేయర్లపైన గౌరవం ఉంది..
కానీ క్రీజులోకి దిగితే మాత్రం నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. నేనెప్పుడూ అంపైర్లతో గొడవ పెట్టుకోలేదు. కావాలంటే నా కెరీర్ మొత్తం చూడండి, ఎక్కడా అధికారులతో గొడవకి దిగింది లేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్..
1999 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లు రెండు సార్లు తలబడ్డాయి. గ్రూప్ స్టేజీలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 10 పరుగుల తేడాతో గెలిచింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వా 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
అయితే 1999 వరల్డ్ కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌ని చిత్తు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 132 పరుగులకి ఆలౌట్ అయ్యింది. షేన్ వార్న్ 4 వికెట్లు తీశాడు... ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి... రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది.