- Home
- Sports
- Cricket
- ఫిట్‌నెస్ లేదు, పర్ఫామెన్స్ అస్సలు బాలేదు... ఎంగేజ్‌మెంట్ తర్వాత పూర్తిగా మారిపోయిన శార్దూల్ ఠాకూర్...
ఫిట్‌నెస్ లేదు, పర్ఫామెన్స్ అస్సలు బాలేదు... ఎంగేజ్‌మెంట్ తర్వాత పూర్తిగా మారిపోయిన శార్దూల్ ఠాకూర్...
శార్దూల్ ఠాకూర్... టీమిండియాకి ఓ మ్యాచ్ విన్నర్. అప్పుడెప్పుడో 2018లో వెస్టిండీస్‌తో టెస్టు ఆరంగ్రేటం చేసినా గాయంతో ఆ మ్యాచ్ ఆడలేకపోయిన శార్దూల్ ఠాకూర్.. 2021లో గబ్బా టెస్టు ద్వారా అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చాడు. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో దుమ్మురేపే పర్పామెన్స్‌తో భారత జట్టుకి కీ ప్లేయర్ అయిపోయాడు...

2021లో ఇంగ్లాండ్‌తో ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్టు సిరీస్ భారత జట్టుకి అద్భుత విజయాలు అందించాడు శార్దూల్ ఠాకూర్. నాటింగ్‌హమ్‌లో జరిగిన తొలి టెస్టులో నాలుగు వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్, గాయం కారణంగా ఆ తర్వాతి రెండు టెస్టులు ఆడలేదు...
<p>shardul thakur</p>
ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టులో రీఎంట్రీ ఇచ్చిన శార్దూల్ ఠాకూర్, బౌలింగ్‌లో మూడు వికెట్లు తీయడమే కాదు... రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసి బ్యాటుతో భళా అనిపించాడు...
ప్రత్యర్థి జట్లకి కొరకరాని కొయ్యలా మారిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌ని రెండు సార్లు అవుట్ చేశాడు శార్దూల్ ఠాకూర్. అలాంటి శార్దూల్ ఠాకూర్, ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. బ్యాటుతో రాణించలేక, బాల్‌తో మ్యాజిక్ చేయలేక... ఫీల్డింగ్‌లోనూ క్యాచ్ డ్రాప్ చేశాడు...
నవంబర్ 2021లో మిట్టలీ పరూల్కర్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న తర్వాత శార్దూల్ ఠాకూర్ ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. ఫిట్‌నెస్ కోల్పోయిన శార్దూల్ ఠాకూర్... పర్పామెన్స్‌లో పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాడు...
Shardul Thakur
2022 వరకూ శార్దూల్ ఠాకూర్ ఆడిన ఏ టెస్టులోనూ భారత జట్టు ఓడిపోలేదు. అయితే ఈ ఏడాదిలో శార్దూల్ ఠాకూర్ ఆడిన మూడు టెస్టుల్లోనూ భారత జట్టుకి ఓటమి తప్పలేదు...
ఐపీఎల్ 2018 నుంచి 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన శార్దూల్ ఠాకూర్, 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి మారాడు. ఎమ్మెస్ ధోనీకి దూరం కావడం వల్లే శార్దూల్ ఠాకూర్ పర్ఫామెన్స్ కూడా పడిపోయిందని అంటున్నారు మాహీ ఫ్యాన్స్...
Shardul Thakur
అతి తక్కువ సమయంలో టీమిండియాకి కీ ప్లేయర్‌గా మారిన శార్దూల్ ఠాకూర్, ఇలాంటి పర్పామెన్స్ కొనసాగిస్తే.. జట్టలో చోటు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. ఇప్పటికైనా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టి, పర్ఫామెన్స్ మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నారు..
ఇప్పటికే వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకోవడానికి తెగ కష్టపడుతున్న శార్దూల్ ఠాకూర్, టెస్టుల్లో కూడా ప్లేస్ కోల్పోతే రీఎంట్రీ ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.
Shardul Thakur
గత సీజన్‌లో 21 వికెట్లు తీసి, సీఎస్‌కేకి టైటిల్ అందించాడు శార్దూల్ ఠాకూర్. ఆల్‌రౌండర్‌గా శార్దూల్‌ని రూ.10.75 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఈ సీజన్‌లో బౌలింగ్‌లో 15 వికెట్లు తీసిన శార్దూల్, 9.79 ఎకానమీతో బౌలింగ్ చేసి గతంలో కంటే ఎక్కువ పరుగులు సమర్పించాడు.