కెప్టెన్‌కీ చెప్పకుండా వైస్ కెప్టెన్‌ని ఎలా నియమిస్తారు? పీసీబీపై షాహిద్ ఆఫ్రిదీ ఫైర్...
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, తాత్కాలిక చీఫ్ సెలక్టర్ షాహిద్ ఆఫ్రిదీ, పీసీబీపై ఫైర్ అయ్యాడు. స్వదేశంలో ఇంగ్లాండ్ చేతుల్లో టెస్టు సిరీస్‌లో వైట్ వాష్ అయ్యింది పాకిస్తాన్. ఈ పరాజయం తర్వాత పాక్ కెప్టెన్సీ సందిగ్ధం నెలకొంది..
వన్డే, టెస్టులకు ఓ కెప్టెన్‌ని, టీ20ల్లో మరో కెప్టెన్‌ని నియమించాలని పాక్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీ20ల్లో బాబర్ ఆజమ్‌ని కెప్టెన్‌గా కొనసాగించి... వన్డే, టెస్టుల్లో షాన్ ఆఫ్రిదీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి...
ఇందులో భాగంగానే మహ్మద్ రిజ్వాన్‌ని తప్పించి, వన్డేల్లో షాన్ మసూద్‌ని వైస్ కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది పీసీబీ. అయితే వైస్ కెప్టెన్‌గా నియమించబడిన తర్వాత షాన్ మసూద్, తుది జట్టులో చోటు కోల్పోయాడు...
‘షాన్ మసూద్‌కి వన్డేల్లో వైస్ కెప్టెన్సీ ఇవ్వకుండా ఉండాల్సింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు పీసీబీ ఛైర్మెన్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ని, చీఫ్ సెలక్టర్ అభిప్రాయాలను కూడా తీసుకోవాల్సింది. వాళ్లతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సింది...
shan masood
నాకు కానీ, బాబర్ ఆజమ్‌కి కానీ షాన్ మసూద్, వైస్ కెప్టెన్ అవుతున్న విషయం తెలీదు. అతన్ని తుది జట్టులో ఆడించాలనే ఆలోచన కూడా లేదు. షాన్ మసూద్, కౌంటీల్లో బాగా ఆడాడు. కౌంటీ పర్ఫామెన్స్ కారణంగా పాక్ జట్టుకి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం కరెక్ట్ కాదు...
Shan Masood
బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా రాటుతేలుతాడనే నమ్మకం నాకు ఉంది. మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉండడం కంటే టెస్టులు, వన్డేల్లో ఓ కెప్టెన్‌ని పెట్టి, టీ20లకు మరో కెప్టెన్ ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు షాహిద్ ఆఫ్రిదీ...
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా ఎంపికైన షాన్ మసూద్, తొలి వన్డేలో డకౌట్ అయ్యాడు. మిగిలిన రెండు వన్డేల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు..