MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మా మాజీ క్రికెటర్లు యూట్యూబ్ వ్యూస్ కోసం దిగజారుతున్నారు : పాక్ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్

మా మాజీ క్రికెటర్లు యూట్యూబ్ వ్యూస్ కోసం దిగజారుతున్నారు : పాక్ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్

యూట్యూబ్ లో వ్యూస్, రేటింగ్స్ కోసం కొంతమంది మాజీ క్రికెటర్లు  ఏది పడితే అది వాగడం, ఎవరిని పడితే వారిని ఇష్టారీతిన మాట్లాడటం చేస్తున్నారని.. అది దేశాన్ని కించపరుస్తుందే తప్ప  ఏమాత్రం ఉపయోగం లేని ప్రక్రియ అని మాజీ  కెప్టెన్ అన్నాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Feb 02 2023, 05:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇటీవల కాలంలో  పాకిస్తాన్ మాజీ క్రికెటర్లందరూ యూట్యూబ్  లో  దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. నాటి రషీద్ లతీఫ్, రమీజ్ రాజా నుంచి మొదలుకుని  మొన్నటి ఇంజమామ్ ఉల్ హక్,  షోయభ్ అక్తర్, నిన్నటి సల్మాన్ భట్, డానిష్ కనేరియాలు  నిత్యం  యూట్యూబ్ లలో ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ముఖ్యంగా వీళ్లంతా పాకిస్తాన్ క్రికెట్ తో   పాటు అంతర్జాతీయంగా మరీ ముఖ్యంగా ఇండియా, ఐపీఎల్ మ్యాచ్ లపై వాళ్ల విశ్లేషణలు చేస్తుంటారు. వీటిని పాకిస్తాన్ లో ఎంతమంది చూస్తారో లేదో తెలియదు గానీ  భారత క్రికెట్ గురించి మాట్లాడతారు కాబట్టి ఇక్కడ కూడా మంచి వ్యూసే వస్తున్నాయి. 

36

అయితే పనిలో  పనిగా  పాకిస్తాన్ క్రికెట్ మీద,  కెప్టెన్ బాబర్ ఆజమ్ మీద, పీసీబీ, ఇతర సిబ్బంది మీద  రాళ్లేయడం వీరికి ఆనవాయితీగా మారింది. వీళ్లు, వాళ్లు అని తేడా లేకుండా అందరూ ఈ రకమైన ధోరణికి అలవాటుపడ్డారు. ఏదైనా ఇష్యూ జరిగితే యూట్యూబ్ లోకి రావడం  దాని గురించి విశ్లేషణ  అని ఊదరగొట్టడమే వీళ్ల పనిగా మారింది. 

46

ఈ క్రమంలో  వీళ్లు నానాటికీ దిగజారుతున్నారని  అక్కడి క్రికెట్ ఫ్యాన్సే వాపోతున్నారు. తాజాగా  పాకిస్తాన్ మాజీ సారథి  మిస్బా ఉల్ హక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.  యూట్యూబ్ లో వ్యూస్, రేటింగ్స్ కోసం కొంతమంది  ఏది పడితే అది వాగడం, ఎవరిని పడితే వారిని ఇష్టారీతిన మాట్లాడటం చేస్తున్నారని అది దేశాన్ని కించపరుస్తుందే తప్ప  ఏమాత్రం ఉపయోగం లేని ప్రక్రియ అని అన్నాడు. 

56

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మిస్బా మాట్లాడుతూ.. ‘ఈ విషయంలో నేను మా సొంత వ్యవస్థను నిందిస్తున్నా.  ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకుంటూ ఎవరికి నచ్చింది వాళ్లు మాట్లాడుతున్నారు. మా క్రికెటర్లను, మా మాజీలను మేమే విమర్శించుకుంటున్నాం.  దీనిద్వారా మా ఇమేజీని మేమే డ్యామేజీ చేసుకుంటున్నాం.

66

ఈ యూట్యూబ్ లలో వీడియోలు  చేసేవారికి  మాజీలు అంటే గౌరవం లేదు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్ల గురించి బాధ్యత లేదు. నోటికి ఏది పడితే అది వాగుతున్నారు. మీడియా, మాజీ క్రికెటర్లలో కొంతమంది యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా వాళ్ల వ్యూస్ కోసం ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఇది మంచిదికాదు.   చివరికి ఇది పాకిస్తాన్ క్రికెట్ కే కీడు చేస్తుంది..’అని చెప్పాడు. 

About the Author

SM
Srinivas M
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
Recommended image2
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image3
IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved