ఫైనల్‌కి బుమ్రాని ఎందుకు ఎంపిక చేశారు? అతని ఫామ్ ఎలా ఉందో తెలీదా? - మాజీ క్రికెటర్ సబా కరీం...
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో జస్ప్రిత్ బుమ్రా పర్ఫామెన్స్‌పై చర్చ జరుగుతూనే ఉంది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్లేమీ తీయలేకపోయిన బుమ్రా, బ్యాటుతో రెండుసార్లు డకౌట్ అయ్యాడు...
జస్ప్రిత్ బుమ్రా పర్ఫామెన్స్ బాగోలేదని తెలిసినా, కేవలం అతని స్టార్‌డమ్ కారణంగానే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌కి అతన్ని ఎంపిక చేశారని అభిప్రాయపడ్డాడు జాతీయ సెలక్టర్, మాజీ క్రికెటర్ సబా మాలిక్...
‘ఏ ప్లేయర్‌నైనా ఎంపిక చేసే ముందు అతని ఫామ్‌ను దృష్టిలో పెట్టుకోటవాలి. మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ విషయంలో అదే జరిగింది.
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మంచి పర్పామెన్స్ ఇచ్చిన మయాంక్‌ను పక్కనబెట్టి, ఆస్ట్రేలియా టూర్‌లో రాణించాడనే ఒకే కారణంగా శుబ్‌మన్ గిల్‌ని ఓపెనర్‌గా తీసుకున్నారు. బౌలర్ల విషయంలో కూడా ఇదే ఫార్ములాను ప్రామాణికంగా తీసుకోవాల్సింది.
ఆస్ట్రేలియా పర్యటనలో గాయం తర్వాత బుమ్రా టెస్టు సిరీస్ సరిగా ఆడింది లేదు. ఇంగ్లాండ్ సిరీస్‌కి ఎంపికైనా మూడు టెస్టుల్లో అతను బౌలింగ్ వేసింది చాలా తక్కువ ఓవర్లు...
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కి కానీ, వన్డే సిరీస్‌కి కానీ బుమ్రా అందుబాటులో లేడు. ఐపీఎల్ పర్ఫామెన్స్ ఆధారంగా టెస్టులకు ఎంపిక చేయడం కరెక్టు కాదు కూడా... అయినా కూడా బుమ్రాను ఫైనల్‌కి ఎంపిక చేశారంటే దానికి అతనిపై ఉన్న నమ్మకమే కారణం...
తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ తీయలేకపోయిన బుమ్రా, రెండో ఇన్నింగ్స్‌లో రిథమ్ అందుకుంటున్నాడని భావించా. అయితే పూజారా క్యాచ్ డ్రాప్ చేయడం అతని బ్యాడ్‌లక్...
ఆ డ్రాప్ క్యాచ్ తర్వాత బుమ్రా... సరైన లెంగ్త్‌ను అందుకోలేకపోయాడు. టెస్టు మ్యాచుల్లో వన్డే, టీ20ల్లో వేసినట్టు బౌలింగ్ వేస్తే కుదరదు. పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ స్టైల్ మారుస్తూ ఉండాలి. ఆ విషయంలో బుమ్రా ఫెయిల్ అయ్యాడు’ అంటూ కామెంట్ చేశాడు మాజీ వికెట్ కీపర్ సబా మాలిక్...
తొలి ఇన్నింగ్స్‌లో భారీగా పరుగులు ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా... రెండో ఇన్నింగ్స్‌లో కాస్త ఎకానమీతో బౌలింగ్ చేసినా వికెట్లు తీయలేకపోయాడు.
బుమ్రా బౌలింగ్‌లో రాస్ టేలర్ ఇచ్చిన క్యాచ్‌ను పూజారా జారవిడచడంతో వికెట్ దక్కే ఛాన్స్ కూడా కోల్పోయాడు... బుమ్రా ఫామ్‌పై అనుమానాలు రేగడంతో అతని స్థానంలో సిరాజ్ లేదా శార్దూల్ ఠాకూర్‌ని ఆడించాలని టీమిండియా ఆలోచిస్తున్నట్టు సమాచారం.