- Home
- Sports
- Cricket
- ఇంతమందిలోంచి 11 మందిని సెలక్ట్ చేయడం చాలా కష్టం... సెలక్టర్లకు దినేశ్ కార్తీక్ సపోర్ట్...
ఇంతమందిలోంచి 11 మందిని సెలక్ట్ చేయడం చాలా కష్టం... సెలక్టర్లకు దినేశ్ కార్తీక్ సపోర్ట్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత చేతన్ శర్మ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీపై వేటు వేసింది బీసీసీఐ. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత జరిగిన పరిణామాలకు సెలక్టర్లను బలిపశువుని చేస్తూ, వారిని పదవుల నుంచి తొలగించింది. అయితే సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మాత్రం సెలక్టర్లకు అండగా నిలిచాడు...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ నుంచి ఇంటిదారి పట్టింది. ఈ పరాజయం తర్వాత చీఫ్ సెలక్టర్‌గా ఉన్న చేతన్ శర్మతో పాటు సెలక్షన్ కమిటీ సభ్యులైన సునీల్ జోషీ, హర్విందర్ సింగ్, దేబాషిస్ మోహంతీలను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
Image credit: Chetan Sharma/Instagram
విరాట్ కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు గత ఏడాదిలో 8 మంది కెప్టెన్లను మార్చడం, అనవసరంగా ప్రతీ సిరీస్ తర్వాత ప్లేయర్లకు విశ్రాంతి ఇస్తుండడంపై బీసీసీఐ సీరియస్ అయ్యిందని సమాచారం. అదీకాకుండా టీ20 వరల్డ్ కప్‌కి ఎంపిక చేసిన జట్టులో సంజూ శాంసన్‌కి చోటు ఇవ్వకపోవడం కూడా సెలక్టర్లపై వేటు పడడానికి కారణమైందని వార్తలు వినిపించాయి...
Dinesh Karthik
‘ఈ వార్త నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మేం ఎవ్వరం కూడా దీన్ని ఊహించలేదు. అయితే కొత్త సెలక్టర్ల రాకతో టీమ్‌లో కొత్త కుర్రాళ్లకు అవకాశాలు వస్తాయేమో చూడాలి. ఐసీసీ టైటిల్ గెలవడానికి అడ్డుగా నిలిచిన ఆటంకాలను తొలగించగలిగితే బాగుంటుంది...
Image credit: PTI
అందరూ వేటు వేశారని, తీసి వేశారని అంటున్నారు కానీ నాకు అలా అనిపించడం లేదు. వాళ్ల కాంట్రాక్ట్ గడువు కూడా ముగియడానికి వచ్చింది. అందుకే కొత్త వారిని తీసుకోవడానికి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారని అనుకుంటున్నా.
Dinesh Karthik run out
రిజర్వు బెంచ్‌లో 50-60 మంది ఉన్నప్పుడు వారిలో 11 మందిని సెలక్ట్ చేయడం చాలా పెద్ద పని...
టీమ్‌కి ఉపయోగపడే ప్లేయర్లను కనుక్కోవడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఆ కష్టానికి వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. కొత్త సెలక్టర్లు చాలా దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు దినేశ్ కార్తీక్...
Image credit: Getty
37 ఏళ్ల వయసులో దినేశ్ కార్తీక్‌కి ఆసియా ప్ 2022 టోర్నీలో చోటు దక్కడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ దినేశ్ కార్తీక్‌కి అవకాశం కల్పించారు సెలక్టర్లు. అయితే ఐపీఎల్ పర్ఫామెన్స్‌తో మూడేళ్ల తర్వాత టీమ్‌లోకి వచ్చిన దినేశ్ కార్తీక్... ఐసీసీ టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...