నాన్న చనిపోయినప్పుడే ఆ నిర్ణయం తీసుకున్నా... స్టీవ్ స్మిత్‌తో విరాట్ కోహ్లీ...
First Published Dec 17, 2020, 3:52 PM IST
భారత క్రికెటర్లకి ఇక్కడ ఫాలోయింగ్ ఉండడం మామూలే. కానీ ఓ ఇండియన్ క్రికెటర్‌కి ఆస్ట్రేలియాలో బీభత్సమైన ఫాలోయింగ్, క్రేజ్ ఉందంటే... అది అసాధారణం. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే అన్ని దేశాల్లో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఆసీస్ టూర్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, అక్కడ వీఐపీ సేవలను పొందుతున్నాడు. ఆస్ట్రేలియా జనాలతో పాటు అక్కడి మీడియా కూడా ‘కింగ్’ కోహ్లీని ఆకాశానికి ఎత్తుతోంది...

విరాట్ కోహ్లీ మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లిపోతుండడంతో తమకు దాదాపు రూ.7 కోట్ల నష్టం వస్తోందని సంచలన విషయాన్ని ప్రకటించింది ఆసీస్ టాప్ మీడియా ఛానెల్ 7...

కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ కారణంగా మ్యాచ్ వీక్షించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, విరాట్ వెళ్లిపోతే టెస్టులను చూడడానికి ఆస్ట్రేలియా జనాలు పెద్దగా ఇష్టపడరని కూడా తేల్చిసిందీ ఛానెల్...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?