MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రవిచంద్రన్ అశ్విన్ సక్సెస్ వెనక సీక్రెట్ హ్యాండ్ ఆమె... టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో...

రవిచంద్రన్ అశ్విన్ సక్సెస్ వెనక సీక్రెట్ హ్యాండ్ ఆమె... టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో...

టీమిండియా టెస్టు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ 34వ పుట్టినరోజు నేడు. టెస్టుల్లో టీమిండియాకి కీలక బౌలర్‌గా మారిన రవిచంద్రన్ అశ్విన్, నాలుగేళ్ల తర్వాత టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 17 2021, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

భారత మాజీ లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రిటైర్మెంట్ తర్వాత ఆ రేంజ్‌లో వికెట్లు తీయగల ప్రతిభ ఉన్న స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్... 

214

టెస్టుల్లో అనేక రికార్డులు క్రియేట్ చేసిన అశ్విన్... గాయాల కారణంగా నిలకడైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రవిచంద్రన్ అశ్విన్... 10 ఏళ్ల క్రితం ప్రీతి నారాయణ్‌ను పెళ్లి చేసుకున్నాడు.

314

సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే ప్రీతి నారాయణ్... బోల్డ్ అండ్ హాట్ కామెంట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది... అశ్విన్‌లాగే ప్రీతి కూడా చాలా ఫన్నీగా చమత్కారానికి వెటకారం జోడించి పోస్టులు చేస్తూ ఉంటుంది... 

414

ప్రీతి నారాయణ్ ట్విట్టర్ అకౌంట్‌లో పిన్ చేసి ఉండే 10 ఏళ్ల కిందటి పోస్టు చూస్తే, ఆమె ఎంత మెచ్యూర్డ్ అండ్ ఫన్నీ పర్సనాలిటీయో ఇట్టే అర్థమవుతుంది... 

514

రవిచంద్రన్ అశ్విన్‌ను పెళ్లాడిన తర్వాత తన మొదటి రాత్రి అనుభవాన్ని విచిత్రంగా సోషల్ మీడియాలో పంచుకుంది ప్రీతి అశ్విన్... 

614

శోభనం ముందు రోజు ‘తనకి రేపు మ్యాచ్ ఉంది... దయచేసి పడుకోనివ్వండని తన కుటుంబానికి ఎంతగానో చెప్పానని... కావాలని మా వాళ్లు ఎన్నో గడియారాలు దాచిపెట్టి నిద్ర పాడుచేశారు’అని గుర్తుకుతెచ్చుకుంది... 

714

అయితే ఆ తర్వాతి రోజు మేం మ్యాచ్ ఆడామని... ‘అది నా మొదటి టెస్టు... నేను చాలా కంగారుగా, ఆతృతగా ఉన్నా. కానీ అశ్విన్ ఫీల్డ్‌లో ఉన్నాడనే విషయం నేను మరిచిపోయా... ఇతనికేమో అప్పటికే 300 వికెట్లు పడిపోయాయి... ’ అంటూ కొంటెగా రాసుకొచ్చింది ప్రీతి అశ్విన్.

814

మొదటి రాత్రిని మ్యాచ్‌గా సంబోధించి, సోషల్ మీడియా జనాల అభిమానాన్ని చాటుకుంది ప్రీతి... రవిచంద్రన్ అశ్విన్, ప్రీతి నారాయణ్‌లకు ఆద్య, అకీరా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు...

914

గత ఆస్ట్రేలియా టూర్‌, మొన్నటి ఇంగ్లాండ్ టూర్‌లో ఈ పిల్లలదే హడావుడి... ఇంగ్లాండ్ టూర్‌లో అశ్విన్‌కి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాకున్నా, పిల్లలతో జాలీగా గడుపుతూ ఆ బాధను మరిచిపోయాడు అశ్విన్...

1014

ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టి, సిడ్నీ టెస్టులో బ్యాటుతోనూ రాణించిన రవిచంద్రన్ అశ్విన్... తన సక్సెస్‌లో భార్య ప్రీతికి కూడా క్రెడిట్ ఉందని... ఆమె పిల్లలను, ఇంటిని చూసుకోవడం వల్లే క్రికెట్‌పై పూర్తి ఫోకస్ పెట్టగలిగాననంటూ ‘కుట్టీ స్టోరీస్’ వీడియోల్లో తెలిపాడు.

1114

79 టెస్టుల్లో 413 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్... నాలుగు టెస్టుల సిరీస్‌లో 29 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు..

1214

18 టెస్టుల్లోనే 100 వికెట్ల మైలురాయి అందుకున్న భారత బౌలర్‌గా, 45 టెస్టుల్లోనే 250 వికెట్లు తీసి...అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న బౌలర్‌గా నిలిచాడు...

1314

111 వన్డేల్లో 150 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, 46 టెస్టుల్లో 65 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 400+ వికెట్లతో పాటు 5 సెంచరీలు చేసి కపిల్‌దేవ్ తర్వాత ఆ ఫీట్ సాధించిన భారత ఆల్‌రౌండర్‌గా నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్....

1414

టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో 20 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, భారత జట్టు తరుపున టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో ఉన్నాడు...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Sanju Samson House : సంజూ శాంసన్ రాజభవనం లాంటి ఇల్లు చూశారా? దీని విలువెంతో తెలుసా?
Recommended image2
ICC T20 Rankings : వరల్డ్ కప్ ముగిసినా పాక్ ను వదలనంటున్న ఇషాన్, ఆ ఒక్కటీ లాగేసుకున్నాడుగా..!
Recommended image3
సూర్యకుమార్ ఔట్, అతడికే కెప్టెన్సీ పగ్గాలు.. టీ20 టీమ్ ప్రకటన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved