- Home
- Sports
- Cricket
- అర్జున్ టెండూల్కర్ దగ్గర అన్నీ ఉన్నాయ్, నా దగ్గరేమో... తండ్రితో సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్...
అర్జున్ టెండూల్కర్ దగ్గర అన్నీ ఉన్నాయ్, నా దగ్గరేమో... తండ్రితో సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్...
రంజీ ట్రోఫీలో రికార్డు లెవెల్ పర్ఫామెన్స్‌తో ఇరగదీస్తున్న టీమిండియా సెలక్టర్లను మాత్రం మెప్పించలేకపోతున్నాడు సర్ఫరాజ్ ఖాన్... బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కి, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కి చోటు దక్కుతుందని అంచనా వేసినా, నిరాశే ఎదురైంది...
- FB
- TW
- Linkdin
Follow Us
)
రంజీ ట్రోఫీలో గత రెండు సీజన్లలో కలిపి 1900లకు పైగా పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, 2022-23 సీజన్‌లో 100+ సగటుతో పరుగులు చేస్తూ మెప్పిస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ సగటు విషయంలో ‘ది గ్రేట్’ సర్ డ్రాన్ బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో నిలిచాడు సర్ఫరాజ్ ఖాన్..
రంజీ ట్రోఫీలో దుమ్మురేపే ప్రదర్శన ఇస్తున్నా సర్ఫరాజ్ ఖాన్‌ని పట్టించుకోకపోవడంతో బీసీసీఐపై, సెలక్టర్లపై తీవ్ర విమర్శలు చేశారు భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్. సర్ఫరాజ్ ఖాన్‌ని ఎందుకు సెలక్ట్ చేయడం లేదో చెప్పాలంటూ బీసీసీఐపై ఫైర్ అయ్యారు...
Sarfaraz Khan
తాజాగా సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్, కొడుకు బ్యాటింగ్ టాలెంట్‌ని గమనించి చిన్నతనం నుంచే అతనికి కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. వర్షాకాలంలో గ్రౌండ్‌కి వెళ్లి ప్రాక్టీస్ చేసేందుకు వీలు కాకపోవడంతో తన ఇంటినే మైదానంగా మార్చేశాడు సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్..
Arjun Tendulkar
సర్ఫరాజ్ ఖాన్, తన చిన్నతనంలో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్, పృథ్వీ షాలతో కలిసి ముంబై అండర్14, అండర్19 జట్టు తరుపున ఆడాడు...
Sarfaraz Khan
12 ఏళ్ల వయసులో హారీస్ షీల్డ్ గేమ్‌లో 421 బంతుల్లో 56 ఫోర్లు, 12 సిక్సర్లతో 439 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ స్కూల్ రికార్డును 12 ఏళ్ల వయసులోనే బ్రేక్ చేశాడు సర్ఫరాజ్ ఖాన్.. 2014తో పాటు 2016 అండర్19 వరల్డ్ కప్ టోర్నీలు ఆడిన సర్ఫరాజ్ ఖాన్, 7 హాఫ్ సెంచరీలు సాధించాడు..
‘‘అర్జున్ టెండూల్కర్, సర్ఫరాజ్ ఖాన్ కలిసి క్రికెట్ ఆడేవాళ్లు. ఓ రోజు సర్ఫరాజ్ నా దగ్గరికి వచ్చి... ‘అబ్బూ... అర్జున్ ఎంత లక్కీయో కదా. అతని దగ్గర అన్నీ ఉన్నాయి. కార్లలో వస్తాడు, ఐపాడ్ ఉంది. మంచి బట్టలు ... అన్నీ ఉన్నాయని అన్నాడు...
Tendulkar with his children Sara (left) and Arjun.
ఆ మాటలకు నాకేం చెప్పాలో అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి, ‘అయినా అర్జున్ కంటే నేను చాలా లక్కీ. ఎందుకంటే మా నాన్న, నా కోసం రోజంతా ఇక్కడే ఉంటాడు. అర్జున్ తండ్రి అతనితో అంత సేపు ఉండడు. థ్యాంక్యూ అబు...’ అంటూ కౌగిలించుకున్నాడు... ఆ వయసులోనూ సర్ఫరాజ్ ఖాన్ చాలా మెచ్యూరిటీ సాధించాడని తెలుసుకున్నా...’’ అంటూ చెప్పుకొచ్చాడు సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్..