కథ చాలా దూరం వెళ్లిందే... సారాతో కలిసి పబ్లిక్‌గా తిరగేస్తున్న శుబ్‌మన్ గిల్...
క్రికెటర్లకు, సినిమా వాళ్లకు మధ్య చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయి. క్రేజ్, సంపాదన, యాడ్స్ ఇలా అన్నీ ఉన్న క్రికెటర్లతో డేటింగ్ చేయడానికి బాలీవుడ్ హీరోయిన్లు ఎక్కువగా ఇష్టపడతారు. అనుష్క శర్మ, విరాట్‌ని పెళ్లాడగా కిమ్ శర్మ, దీపికా పదుకునే, లక్ష్మీ రాయ్, తాజాగా ఊర్వశి రౌతెల్లా... క్రికెటర్లతో ప్రేమాయణం నడిపిన హీరోయిన్ల లిస్టు చాలా పెద్దగానే ఉంది. తాజాగా ఈ లిస్టులో సారా ఆలీ ఖాన్ కూడా చేరిపోయింది...

భారత యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి సారా ఆలీ ఖాన్ ఓ రెస్టారెంట్‌లో కనిపించింది. అప్పుడే ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అంతకుముందే సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో శుబ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని చాలా కాలం పాటు వార్తలు వినిపించాయి...
సారా టెండూల్కర్ పోస్టుపై శుబ్‌మన్ గిల్, గిల్ ఇన్‌స్టా పోస్టులపై సారా చేసిన కామెంట్లతో వీళ్లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, ఈ ఇద్దరూ కలిసి గోవాలో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా రకరకాల వార్తలు వినిపించాయి. అయితే అటు శుబ్‌మన్ గిల్ కానీ, ఇటు సారా టెండూల్కర్ కానీ ఈ వార్తలపై స్పందించలేదు...
అయితే ఏమైందో ఏమో కానీ టెండూల్కర్ సారాకి బ్రేకప్ చెప్పి, ఆలీ ఖాన్ సారాతో ప్రేమాయణం మొదలెట్టేశాడు శుబ్‌మన్ గిల్. సారా టెండూల్కర్‌తో ఎప్పుడూ పబ్లిక్‌గా బయటతిరగని శుబ్‌మన్ గిల్, బాలీవుడ్ బ్యూటీతో ఎలాంటి దాపరికాలు లేకుండా చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నాడు...
తాజాగా సారా ఆలీ ఖాన్, శుబ్‌మన్ గిల్ కలిసి ముంబైలో ఓ హోటల్‌లో కలిసి బస చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే ఫ్లైట్‌లో పక్కపక్కన కూర్చొని వెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ కూతురైన సారా ఇప్పటికే హర్షవర్థన్ రాణా, కార్తీక్ ఆర్యన్, ఇషాన్ కట్టర్, వీర్ పహారియా వంటి బాలీవుడ్ నటులతో ప్రేమాయణం నడిపింది...
ఇప్పుడు ఈ లిస్టులోకి శుబ్‌మన్ గిల్ కూడా చేరిపోయాడు. బాలీవుడ్ హీరోలతో కొన్నాళ్లు తిరిగి బ్రేకప్ చెప్పేసిన సారా, గిల్‌ని కూడా ఇలాగే ‘గిల్లి’ వదిలి పెడుతుందా? లేక వీరి వ్యవహారం పెళ్లి దాకా వెళ్తుందా తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే...
Image Credit: Shubman Gill Instagram (L); Sara Tendulkar Instagram (R)
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కి అల్లుడు అవుతాడని అనుకున్న శుబ్‌మన్ గిల్ కాస్తా, బాలీవుడ్ హీరో, ‘ఆదిపురుష్’ రావణుడు సైఫ్ ఆలీ ఖాన్‌కి అల్లుడిగా మారబోతున్నాడంటూ సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి...