MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మరో అవకాశాన్ని వేస్ట్ చేసుకున్న యజ్వేంద్ర చాహాల్, సంజూ శాంసన్... వరల్డ్ కప్‌లో చోటు కష్టమేనా..

మరో అవకాశాన్ని వేస్ట్ చేసుకున్న యజ్వేంద్ర చాహాల్, సంజూ శాంసన్... వరల్డ్ కప్‌లో చోటు కష్టమేనా..

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియాకి వైట్ బాల్ క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉంటూ వచ్చాడు యజ్వేంద్ర చాహాల్. అయితే అతనికి టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాహాల్, టీ20 వరల్డ్ కప్ 2024 ఆడడమూ అనుమానంగా మారింది..

Chinthakindhi Ramu | Published : Aug 14 2023, 03:52 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Yuzvendra Chahal

Yuzvendra Chahal

వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 5 మ్యాచుల్లో 5 వికెట్లు మాత్రమే తీయగలిగాడు యజ్వేంద్ర చాహాల్. కుల్దీప్ యాదవ్ 4 మ్యాచుల్లో 6 వికెట్లు తీసి బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. చాహాల్ కంటే కుల్దీప్ యాదవ్ ఎకానమీ కూడా చాలా మెరుగ్గా ఉంది..

29
Asianet Image

వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో 4 ఓవర్లలో 51 పరుగులు సమర్పించాడు యజ్వేంద్ర చాహాల్. మరో ఎండ్‌లో కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. అక్షర్ పటేల్ ఒక్క ఓవర్ వేసినా 8 పరుగులే ఇచ్చాడు.

39
Asianet Image

టీ20 ఇన్నింగ్స్‌లో 50కి పైగా పరుగులు ఇవ్వడం యజ్వేంద్ర చాహాల్‌కి ఇది నాలుగో సారి. ఇంతకుముందు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్ రెండేసి సార్లు ఈ చెత్త రికార్డు నెలకొల్పారు.. 
 

49
Sanju Samson

Sanju Samson

అలాగే సంజూ శాంసన్, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. గత ఏడాది ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో దీపక్ హుడాతో కలిసి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు సంజూ శాంసన్..

59
Asianet Image

ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్‌లో చేసిన 77 పరుగులు మినహాయిస్తే, 22 మ్యాచుల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు సంజూ శాంసన్. 18.5 యావరేజ్‌తో 333 పరుగులు మాత్రమే చేశాడు సంజూ..

69
Sanju Samson

Sanju Samson

తొలి టీ20లో 12 పరుగులు చేసి రనౌట్ అయిన సంజూ శాంసన్, రెండో మ్యాచ్‌లో 7 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు. టీమిండియా గెలిచిన మూడు, నాలుగో టీ20 మ్యాచుల్లో బ్యాటింగ్‌కి రాని సంజూ శాంసన్, ఫైనల్ మ్యాచ్‌లో 9 బంతుల్లో 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.. 

79
Asianet Image

చూస్తుంటే సంజూ శాంసన్, యజ్వేంద్ర చాహాల్.. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో చోటు దక్కడం అనుమానంగానే మారింది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ వీళ్లు ఆడడం కష్టమే. ఎందుకంటే కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే, అతనితో పాటు ఇషాన్ కిషన్‌కి వికెట్ కీపర్‌గా టీమ్‌లో చోటు దక్కొచ్చు..

89
Yuzvendra Chahal Kudeep Yadav

Yuzvendra Chahal Kudeep Yadav

అలాగే కుల్దీప్ యాదవ్‌ని ప్రధాన స్పిన్నర్‌గా తీసుకునే సెలక్టర్లు, అతనితో పాటు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లను స్పిన్ ఆల్‌రౌండర్లుగా ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  

99
Asianet Image

భారత్‌లో మంచి రికార్డు ఉన్నా.. గత రెండు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో చోటు దక్కించుకోలేకపోయిన యజ్వేంద్ర చాహాల్, ఈసారి అయినా వరల్డ్ కప్ ఆడతాడో లేదో సెలక్టర్ల నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. 

Chinthakindhi Ramu
About the Author
Chinthakindhi Ramu
 
Recommended Stories
Top Stories