MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Team India: సూర్యకు షాక్.. అయ్యర్ కాదు.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా సంజూ? సెలక్టర్ల ప్లాన్ ఇదే!

Team India: సూర్యకు షాక్.. అయ్యర్ కాదు.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా సంజూ? సెలక్టర్ల ప్లాన్ ఇదే!

Team India Captain: టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులోకి సంజూ శాంసన్ దూసుకొచ్చాడు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శాంసన్‌కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 11 2026, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టీమిండియా కెప్టెన్సీలో మార్పులు..
Image Credit : Getty

టీమిండియా కెప్టెన్సీలో మార్పులు..

భారత టీ20 క్రికెట్‌లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయా? టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై సెలక్టర్లు అసహనంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్, త్వరలోనే టీమిండియా టీ20 పగ్గాలను చేపట్టే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సంజూ నాయకత్వ లక్షణాలపై మొగ్గు చూపుతున్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
ఫామ్ తో ఇబ్బందిపడుతున్న సూర్యకుమార్ యాదవ్
Image Credit : x@IPL

ఫామ్ తో ఇబ్బందిపడుతున్న సూర్యకుమార్ యాదవ్

ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపినప్పటికీ, వ్యక్తిగతంగా అతని ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఐపీఎల్ 2026లో సూర్య ఘోరంగా విఫలమవుతున్నాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేశాడు, సగటు కేవలం 19.52 మాత్రమే ఉంది. ప్రపంచకప్‌లో కూడా అమెరికాపై చేసిన ఇన్నింగ్స్ మినహా పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ భారాన్ని వేరే ఎవరికైనా అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది.

Related Articles

Related image1
5 Most Dangerous Batsmen: క్రికెట్ హిస్టరీలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్లు వీరే.. క్రీజులోకి వస్తే బౌలర్లకు వణుకే!
Related image2
World Coldest Places: ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్లేసెస్ ఇవే! ఇక్కడ ఎలా బతుకుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు !
36
కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో సంజూ శాంసన్.. ఎందుకంటే?
Image Credit : Getty

కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో సంజూ శాంసన్.. ఎందుకంటే?

సంజూ శాంసన్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సంజూ, ఈ సీజన్‌లో ఇప్పటికే 400లకు పైగా పరుగులు చేశాడు. ఇందులో సెంచరీలు కూడా ఉన్నాయి. గతంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూకు మంచి అనుభవం ఉంది. టీ20 ప్రపంచకప్‌లో కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో (ఇంగ్లండ్, న్యూజిలాండ్‌పై) అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని నిలకడ, ఒత్తిడిలో ఆడే తీరు సెలక్టర్లను బాగా ఆకట్టుకున్నాయి.

46
శ్రేయస్ అయ్యర్‌కు దక్కని ఛాన్స్
Image Credit : Getty

శ్రేయస్ అయ్యర్‌కు దక్కని ఛాన్స్

కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్ పేరు కూడా వినిపించింది. పంజాబ్ కింగ్స్ తరపున అద్భుతంగా ఆడుతున్నప్పటికీ, ఒక ప్రధాన కారణం అతనిని వెనక్కి నెట్టింది. అయ్యర్ డిసెంబర్ 2023 నుండి భారత టీ20 జట్టులో లేడు. చాలా కాలం జట్టుకు దూరంగా ఉండి, నేరుగా వచ్చి కెప్టెన్సీ చేపట్టడం సరైన నిర్ణయం కాదని సెలక్టర్లు భావిస్తున్నారు. మరోవైపు సంజూ శాంసన్ వరుసగా జట్టులో కొనసాగుతుండటం అతనికి కలిసి వచ్చే అంశం.

56
అభిషేక్ శర్మతో అదిరిపోయే జోడీ
Image Credit : Getty

అభిషేక్ శర్మతో అదిరిపోయే జోడీ

సంజూ శాంసన్ ఇప్పుడు ఓపెనర్‌గా కూడా సత్తా చాటుతున్నాడు. ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మతో కలిసి సంజూ ఇచ్చే ఆరంభాలు టీమిండియాను తిరుగులేని శక్తిగా మార్చాయి. స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై సంజూ చేసిన హాఫ్ సెంచరీ భారత్‌కు అత్యధిక స్కోరు సాధించడంలో సాయపడింది. మిడిల్ ఆర్డర్‌లో కంటే ఓపెనర్‌గా సంజూ మరింత దూకుడుగా ఆడుతున్నాడు.

66
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో కొత్త కెప్టెన్?
Image Credit : Getty

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో కొత్త కెప్టెన్?

ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అందుకోకపోతే, ఈ పర్యటనల నుండే సంజూ శాంసన్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కాబట్టి సూర్యకు మరికొంత సమయం ఇవ్వాలని కొందరు సెలక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, రాబోయే రోజుల్లో సంజూ శాంసన్ టీమిండియా బాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
5 Most Dangerous Batsmen: క్రికెట్ హిస్టరీలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్లు వీరే.. క్రీజులోకి వస్తే బౌలర్లకు వణుకే!
Recommended image2
IPL ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. ఉర్విల్‌ పటేల్‌ సునామీ ఇన్నింగ్స్ తో లక్నో ను దెబ్బకొట్టిన చెన్నై
Recommended image3
Vaibhav Sooryavanshi : సచిన్, కోహ్లీ వల్ల కాలేదు.. 15 ఏళ్ల కుర్రాడు వరల్డ్ రికార్డ్ కొట్టాడు!
Related Stories
Recommended image1
5 Most Dangerous Batsmen: క్రికెట్ హిస్టరీలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్లు వీరే.. క్రీజులోకి వస్తే బౌలర్లకు వణుకే!
Recommended image2
World Coldest Places: ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్లేసెస్ ఇవే! ఇక్కడ ఎలా బతుకుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved