MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సంజూ శాంసన్ కూడా రోహిత్ శర్మ లాంటోడే! సరిగ్గా వాడుకోవాలంటే టాపార్డర్‌లో ఆడించండి... మాజీ క్రికెటర్ సలహా..

సంజూ శాంసన్ కూడా రోహిత్ శర్మ లాంటోడే! సరిగ్గా వాడుకోవాలంటే టాపార్డర్‌లో ఆడించండి... మాజీ క్రికెటర్ సలహా..

2007లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, టీమ్‌లో స్థిరమైన చోటు దక్కించుకోవడానికి 2013 వరకూ వేచిచూడాల్సి వచ్చింది. ఓపెనర్‌గా మారిన తర్వాత రోహిత్ శర్మ, ‘హిట్‌మ్యాన్’గా మారాడు.. సంజూ కూడా ఇలాగే అవుతాడని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా..

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 16 2023, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

2015లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్, 2023 ఆగస్టు వరకూ ఆడింది మొత్తంగా 12 వన్డేలు, 16 టీ20 మ్యాచులే.. 2021లో ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. సంజూ శాంసన్ కంటే రెట్టింపు మ్యాచులు ఆడేశారు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Sanju Samson

Sanju Samson

అడపాదడపా వచ్చే అవకాశాలను సంజూ శాంసన్ సరిగ్గా వాడుకోలేకపోతున్నాడు. వెస్టిండీస్ టూర్‌లో టీ20 సిరీస్‌లో 5 మ్యాచులు ఆడిన సంజూ శాంసన్, మూడు మ్యాచుల్లో బ్యాటింగ్‌కి వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.. 

38

‘సంజూ శాంసన్ కూడా రోహిత్ శర్మ లాంటోడే. అతని నుంచి బెస్ట్ పర్ఫామెన్స్ రాబట్టాలంటే ఫార్మాట్‌తో సంబంధం లేకుండా టాపార్డర్‌లో ఆడించాలి.. టాపార్డర్‌లోనే సంజూ సక్సెస్ అవ్వగలడు...

48

రోహిత్ శర్మ కూడా చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తాడు. అతనిలో టాలెంట్ పుష్కలంగా ఉందని అందరికీ తెలుసు. అందరి కెరీర్ ప్రారంభంలో మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడానికి రోహిత్ శర్మ చాలా ఇబ్బంది పడ్డాడు..

58
sanju samson

sanju samson

రోహిత్ శర్మ గణాంకాలు, ఓపెనర్‌గా మారిన తర్వాతే మారాయి. సంజూ శాంసన్‌ని కూడా టాపార్డర్‌లో బ్యాటింగ్‌కి పంపితే ఇదే జరుగుతుంది. అతను ఓపెనర్‌గా, వన్‌డౌన్ ప్లేయర్‌‌గా, నాలుగో స్థానంలో కూడా ఆడగల ప్లేయర్. ఐపీఎల్‌లోనూ ఈ స్థానాల్లోనూ సక్సెస్ అయ్యాడు..

68

లోయర్ మిడిల్ ఆర్డర్‌లో సంజూ శాంసన్‌ని బ్యాటింగ్‌కి పంపి, ఫినిషర్‌గా చేయాలనుకోవడం సరైన వ్యూహం కాదని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే అతనికి ఇచ్చిన అవకాశాలను సరిగా వాడుకోలేకపోయాడు కూడా...

78

మిడిల్ ఆర్డర్‌లో అతని గణాంకాలు సరిగా లేవని తెలిసినా అక్కడే ఆడాలని పంపడం ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు. అతనికి అవకాశాలు ఇస్తున్నాం, ఆడడం లేదని చెప్పడానికే ఇలా లోయర్ ఆర్డర్‌లో సంజూని బ్యాటింగ్‌కి పంపుతున్నట్టుగా ఉంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజూ శాంసన్.. 

88
Sanju Samson

Sanju Samson

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ వంటి ప్లేయర్లు స్వదేశానికి వచ్చేశారు. సంజూ శాంసన్ మాత్రం ఐర్లాండ్ టూర్‌లో ఆడబోతున్నాడు. 

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
Ira Aery : క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఆల్‌రౌండర్.. ఈ ముక్కుపుడక సుందరి ఎవరో తెలిస్తే షాకవుతారు !
Recommended image2
Women's T20 World Cup: టీమిండియాకు బిగ్ షాక్.. వరల్డ్ కప్ మధ్యలోనే స్టార్ ప్లేయర్ అవుట్.. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన ఆర్సీబీ బ్యూటీ !
Recommended image3
India Highest ODI Scores : పిచ్ ఏదైనా బాదుడే.. వన్డేల్లో భారత్ క్రియేట్ చేసిన మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved