- Home
- Sports
- Cricket
- పంత్, అయ్యర్ మీద ఉన్న నమ్మకం... సంజూ శాంసన్ మీద లేదా! టీమిండియాపై మరోసారి ట్రోల్స్...
పంత్, అయ్యర్ మీద ఉన్న నమ్మకం... సంజూ శాంసన్ మీద లేదా! టీమిండియాపై మరోసారి ట్రోల్స్...
సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత జనాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న క్రికెటర్‌గా నిలుస్తాడు సంజూ శాంసన్. కేరళ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంజూ శాంసన్‌కి విపరీతమైన క్రేజ్ ఉంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ సమయంలోనే సంజూ క్రేజ్ గురించి అర్థమైంది...

Sanju Samson
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి సంజూ శాంసన్‌ని ఎంపిక చేయకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. సంజూ శాంసన్ స్థానంలో టీమిండియాలో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ కేరళ కుర్రాడిని జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ మరింత పెరిగింది...
Sanju Samson
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడిన వికెట్ కీపర్లు దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్... టీమిండియా తరుపున ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా 20+ పరుగులు చేయలేకపోయారు. ఈ ఇద్దరి ఫెయిల్యూర్‌తో సంజూ శాంసన్‌ని తీసుకుని ఉంటే బాగుండేదనే వారి సంఖ్య మరింత పెరిగింది...
Sanju Samson
తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ సంజూ శాంసన్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో టీ20లో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్, మూడో మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...
Sanju Samson and Rishabh Pant
2015లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్, ఇప్పటిదాకా 16 మ్యాచులే ఆడితే... 2017లో వచ్చిన రిషబ్ పంత్ ఇప్పటికే 65 మ్యాచులు ఆడేశాడు. అలాగని సంజూ శాంసన్ మరీ అట్టర్ ఫ్లాప్ ఏమీ అవ్వలేదు...
ఈ ఏడాది సంజూ శాంసన్ 5 మ్యాచులు ఆడి 44.75 సగటుతో 179 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 77 పరుగులు. రిషబ్ పంత్ 20 మ్యాచులు ఆడి 22.06 సగటుతో 353 పరుగులే చేశాడు. పంత్ హై స్కోరు 52 పరుగులు...
Sanju Samson-Shreyas Iyer
సంజూ శాంసన్ 158.41 స్ట్రైయిక్ రేటుతో బ్యాటింగ్ చేస్తే, రిషబ్ పంత్ స్ట్రైయిక్ రేటు 131.22 మాత్రమే. టీ20ల్లో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నా రిషబ్ పంత్‌లో ఏదో ఉందని, అతని నుంచి ఏదో కోరుకుంటూ వరుస అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్... సంజూ శాంసన్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతూ తీరని అన్యాయం చేస్తోందని వాపోతున్నారు అభిమానులు..
Sanju Samson
ఆఖరికి శ్రేయాస్ అయ్యర్ కూడా వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. అయినా భారత జట్టులో చోటు దక్కించుకోగలుగుతున్నాడు. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌ల మీద అంత ప్రేమ చూపిస్తున్న బీసీసీఐ, సంజూ శాంసన్‌ని పట్టించుకోకపోవడానికి అతను దక్షిణ భారతదేశానికి చెందినవాడు కావడమే కారణమంటున్నారు మరికొందరు..