సంజూ శాంసన్ చేసిన ఆ తప్పు వల్లే ఓడిపోయారు... ఆర్ఆర్ ఓటమిపై సచిన్ టెండూల్కర్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో సంచలన ఆటతీరుతో ఫైనల్‌కి దూసుకొచ్చింది రాజస్థాన్ రాయల్స్. 2020 సీజన్‌లో ఆఖరి స్థానంలో, 2021లో ఏడో స్థానంలో నిలిచిన జట్టు, ఈ సారి ఏకంగా ఫైనల్‌కి దూసుకువస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు... అయితే ఫైనల్‌లో మాత్రం రాయల్స్ ఆటతీరు తీవ్రంగా నిరాశపరిచింది...

అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తడబడిన రాజస్థాన్ రాయల్స్, వరుస వికెట్లు తీసి ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడంలో విఫలమై, చిత్తుగా ఓడింది...
సీజన్‌లో 13 సార్లు టాస్ ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, సీజన్‌లో జరిగిన ఆఖరి రెండు మ్యాచుల్లోనూ టాస్ గెలిచాడు. రెండో క్వాలిఫైయర్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని గెలిచిన సంజూ శాంసన్, ఫైనల్‌లో మాత్రం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది...
‘టాస్ గెలిచిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని ఉంటే, ప్రెషర్ గుజరాత్ టైటాన్స్‌పైన ఉండేది. టైటాన్స్‌కి తొలుత బ్యాటింగ్ చేసిన సందర్భాల్లో పెద్దగా విజయాలు దక్కలేదు...
గుజరాత్ టైటాన్స్ ఛేదనలోనే ఎక్కువ విజయాలు అందుకుంది. అయితే సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకుని తప్పుచేశాడు. బహుశా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేసి, వారిని ఒత్తిడిలో పడేయవచ్చని సంజూ అనుకుని ఉంటాడు...
అయితే అదే పిచ్‌పై రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడారు. వాళ్లకి పిచ్ ఎలా ఉందో అర్థమయ్యే ఉండాలి. గుజరాత్ టైటాన్స్, ఈ పిచ్‌పై తొలిసారి ఆడుతుందన్న అడ్వాంటేజ్‌ని రాయల్స్ ఉపయోగించుకోలేకపోయింది..
Image credit: PTI
జోస్ బట్లర్ ఒక్కడూ ఎంత అని చేయగలడు. అతని వల్లే రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ దాకా వచ్చింది. మిగిలిన వాళ్లు ఎంత పోరాడినా... జోస్ బట్లర్ చేసిన దానితో సమానం కాదు...
Image credit: PTI
జోస్ బట్లర్ ఫామ్ మీద నమ్మకంతోనే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారేమో. అయితే ఒక్కడే ఎంత లాగినా సరైన సహకారం లేకపోతే టైటిల్ అందించలేడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్...