MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సానియా మీర్జా - షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారా!... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న...

సానియా మీర్జా - షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారా!... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న...

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని ప్రేమించి పెళ్లాడింది. 2010లో పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా? సోషల్ మీడియాలో ఈ సెలబ్రిటీ కపుల్ డైవర్స్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 07 2022, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

2009లో హైదరాబాద్‌కి చెందిన తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ మహ్మద్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది సానియా మీర్జా. యూనివర్సల్ బేకర్స్ వారసుడైన మహ్మద్‌తో పెళ్లి దగ్గరపడుతున్న సమయంలో ఈ ఇద్దరూ మనస్పర్థలతో ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆ తర్వాతి ఏడాదే షోయబ్ మాలిక్‌ని పెళ్లాడింది సానియా మీర్జా. 12 ఏళ్లుగా ఈ ఇద్దరి మధ్య వైవాహిక జీవితం సజావుగానే సాగుతోంది.భారత్‌లో 120 కోట్ల మంది జనాభా ఉంటే, పెళ్లి చేసుకోవడానికి పాకిస్తానీయే దొరికాడా? అంటూ కామెంట్లు చేశారు భారత అభిమానులు...

38

ఈ ట్రోలింగ్‌ని తట్టుకోలేక భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడల్లా కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వచ్చింది సానియా మీర్జా. పాక్ క్రికెటర్‌ను పెళ్లాడిన తర్వాత సానియా మీర్జాని తీవ్రంగా ట్రోల్ చేస్తూ, ఆమెను పాకిస్తానీగా అభివర్ణిస్తూ దూషణలు చేసేవాళ్లు నెటిజన్లు..
 

48

పాకిస్తాక్ క్రికెటర్లంటే భారతీయులకు అస్సలు పడదు. అయితే అంతో కొంతో భారతీయులు ప్రేమాభిమానులు చురగొన్న పాక్ క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది షోయబ్ మాలిక్. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని పెళ్లాడక ముందే, భారత క్రికెటర్లతో సన్నిహితంగా ఉండేవాడు షోయబ్ మాలిక్... 

58

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులకు 2018లో ఇజాన్ మీర్జా అనే కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత ఏడాదిన్నరకు పైగా టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకున్న సానియా మీర్జా మాలిక్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో టీమిండియా తరుపున ప్రాతినిథ్యం వహించింది.

68
sania mirza

sania mirza

2020 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొన్న సానియా మీర్జా గాయంతో తప్పుకోగా, టోక్యో ఒలింపిక్స్‌లో రెండో రౌండ్‌లో ఓడింది . 2022 సీజన్‌తో టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. పెళ్లైన తర్వాత యూఏఈకి మకాం మార్చిన షోయబ్ మాలిక్, సానియా మీర్జా జంట ప్రస్తుతం అక్కడే ఉంటోంది. 

78

కొన్నాళ్లుగా సానియా మీర్జా- షోయబ్ మాలిక్ మధ్య సంబంధాలు చెడిపోయాయని, ప్రస్తుతం భారత మాజీ టెన్నిస్ స్టార్ వేరుగా ఉంటోందని వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

88

అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ ఇద్దరూ విడాకులు తీసుకునే ప్రసక్తి లేదని, ఇది ఏదో పుకారు అయి ఉంటుందని కొట్టి పారేస్తున్నారు కొందరు అభిమానులు. ఒకవేళ విడాకుల వార్త నిజమైతే మాత్రం పాక్ క్రికెటర్‌ని పెళ్లాడినందుకే సానియా మీర్జా మరిన్ని ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది... 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image2
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image3
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved