MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పవర్ ప్లే స్పెషలిస్ట్ బౌలర్‌కి ఐపీఎల్ వేలంలో అవమానం... సందీప్ శర్మను పట్టించుకోని ఫ్రాంఛైజీలు...

పవర్ ప్లే స్పెషలిస్ట్ బౌలర్‌కి ఐపీఎల్ వేలంలో అవమానం... సందీప్ శర్మను పట్టించుకోని ఫ్రాంఛైజీలు...

ఐపీఎల్‌లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు సందీప్ శర్మ. నాలుగు సీజన్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కీ బౌలర్‌గా ఉన్న సందీప్ శర్మకు ఐపీఎల్ 2023 మినీ వేలంలో దారుణ అవమానం ఎదురైంది. ఐపీఎల్‌లో 114 వికెట్లు తీసిన సందీప్ శర్మను ఏ ఫ్రాంఛైజీ కూడా కొనుగోలు చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 26 2022, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

2010, 2012 అండర్ 19 వరల్డ్ కప్స్ ఆడిన సందీప్ శర్మ, 2013లో ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి అదరగొట్టాడు సందీప్ శర్మ...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

2017లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌లను అవుట్ చేసిన సందీప్ శర్మ, ఒకే మ్యాచ్‌లో ఈ ముగ్గురినీ అవుట్ చేసిన మొట్టమొదటి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

38

2014 సీజన్‌లో 18 వికెట్లు పడగొట్టిన సందీప్ శర్మ, పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. 2020లో 14 వికెట్లు తీసిన సందీప్ శర్మ, 2021 నుంచి సరైన అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు...

48

ఐపీఎల్‌లో విరాట్‌‌ని ఏడు సార్లు అవుట్ చేసిన సందీప్ శర్మ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోహ్లీని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్‌గా టాప్‌లో ఉన్నాడు. ఆశీష్ నెహ్రా ఆరుసార్లు, బుమ్రా నాలుగు సార్లు మాత్రమే కోహ్లీ వికెట్ తీశారు...

58

సందీప్ శర్మ బౌలింగ్‌లో ఐపీఎల్‌లో 72 బంతులను ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, కేవలం 55 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఏడుసార్లు అవుట్ అయ్యాడు...పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా టాప్‌లో ఉన్నాడు సందీప్ శర్మ...

ఐపీఎల్ కెరీర్‌లో సందీప్ శర్మ 92 ఇన్నింగ్స్‌ల్లో పవర్ ప్లేలో 53 వికెట్లు తీయగా... 99 ఇన్నింగ్స్‌ల్లో 52 వికెట్లు తీసిన జహీర్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు...

68

2020 సీజన్‌లో డుప్లిసిస్‌ను డకౌట్ చేసిన బౌలర్‌గా నిలిచిన సందీప్ శర్మ, 13 మ్యాచులు ఆడి 14 వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో 7.19 ఎకానమీతో బౌలింగ్ చేసి, సన్‌రైజర్స్‌కి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.

78

2018లో సందీప్ శర్మను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 2022 మెగా వేలంలో బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకే పంజాబ్ కింగ్స్‌లోకి వెళ్లాడు సందీప్. గత సీజన్‌లో 5 మ్యాచులు ఆడిన సందీప్ శర్మ, 20 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో అతన్ని వేలానికి వదిలేసింది పంజాబ్ యాజమాన్యం...
 

88

ఐపీఎల్‌లో ఘోరమైన రికార్డు ఉన్న నికోలస్ పూరన్‌ని రూ.16 కోట్లకు కొనుగోలు చేసిన ఫ్రాంఛైజీలు, సందీప్ శర్మను బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రాలేదు. ఇదే ఫారిన్ ప్లేయర్ అయ్యి ఉంటే, వేలంలో కోట్ల రూపాయలు దక్కించుకుని ఉండేవాడని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ విధ్వంసం.. ఆ A సెలబ్రేషన్ సీక్రెట్ ఇదే బ్రో !
Recommended image2
Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు.. గేల్ రికార్డ్ ఇక అవుట్!
Recommended image3
IPL 2026: ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్స్ వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved