- Home
- Sports
- Cricket
- ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ అలా చేసేవాడు... విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై ఇర్ఫాన్ పఠాన్...
ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ అలా చేసేవాడు... విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై ఇర్ఫాన్ పఠాన్...
ఆసియా కప్ 2022 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ మళ్లీ మునుపటి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. టీ20ల్లో, టెస్టుల్లో, వన్డేల్లో సెంచరీలు అందుకుని, సూపర్ ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్ 2023 సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు...

(PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000422B)
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్‌తో కలిసి తొలి వికెట్‌కి 148 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్షద్ ఖాన్ వేసిన ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది మ్యాచ్‌ని ముగించాడు విరాట్ కోహ్లీ..
(PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000388B)
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై భారీ ఆశలు పెట్టుకుంది ముంబై ఇండియన్స్. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో 17 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 28 పరుగులు రాబట్టాడు...
(PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000356B)
‘గొప్ప ప్లేయర్లు ఎప్పుడూ కూడా ప్రత్యర్థి టీమ్‌లో ఉన్న బెస్ట్ బౌలర్లను టార్గెట్ చేస్తారు. సచిన్ టెండూల్కర్ ఇంతకుముందు ఇలా చేసేవాడు. ప్రత్యర్థి టీమ్‌లో బెస్ట్ బౌలర్లు గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్‌ల బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడడం చాలా సార్లు చూశాను..
విరాట్ కోహ్లీ కూడా అదే చేస్తాడు. ఛాలెంజ్‌గా తీసుకున్నప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రత్యర్థి బౌలర్ల నుంచి విరాట్ ఆ ఛాలెంజ్ స్వీకరిస్తాడు. నేను కూడా అందరిలాగే జోఫ్రా ఆర్చర్- విరాట్ కోహ్లీ మధ్య ఫైట్ చూడాలని అనుకున్నా...
(PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000413B)
ఈసారి విరాట్ కోహ్లీ, ఆర్చర్‌పై విజయం సాధించాడు. మొదటి బంతికి ఆర్చర్‌కి అవకాశం వచ్చినా, ఆ తర్వాత అతనికి అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేశాడు విరాట్ కోహ్లీ.. జోఫ్రా ఆర్చర్ బంతి వేసి వెనక్కి తిరిగే లోపు బాల్ బౌండరీ లైన్ దాటుతోంది..
Image credit: PTI
బెస్ట్ బౌలర్లను టార్గెట్ చేసినప్పుడు మిగిలిన బౌలర్లు ఒత్తిడికి గురవుతారు. ఇది వారి బౌలింగ్ లైన్‌ని దెబ్బ తీస్తుంది. అయితే చాలా మంది బెస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడి, మిగిలిన బౌలర్ల బౌలింగ్‌లో అటాక్ చేస్తారు. ఇదే విరాట్‌కీ, మిగిలిన బ్యాటర్లకు ఉన్న తేడా..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్..