- Home
- Sports
- Cricket
- ఆ ముగ్గురూ కలిసి భజ్జీ కంటే ఎక్కువ వికెట్లు తీశారు... కోహ్లీ, రోహిత్, రాహుల్‌లకు ఇంత సుఖం ఎందుకు...
ఆ ముగ్గురూ కలిసి భజ్జీ కంటే ఎక్కువ వికెట్లు తీశారు... కోహ్లీ, రోహిత్, రాహుల్‌లకు ఇంత సుఖం ఎందుకు...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా, సెమీ ఫైనల్‌లో 10 వికెట్ల తేడాతో ఓడింది. టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో వికెట్ తీసిన ఆఖరి భారత బౌలర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు, ఆరేళ్లుగా పదిలంగా ఉంది. స్పెషలిస్టు బౌలర్లు వికెట్ తీయలేనప్పుడు, పార్ట్ టైం బౌలర్లను ప్రయోగించడం అనివార్యం, ఈ ప్రయోగం చాలా సందర్భాల్లో ఫలితాలను ఇస్తుంది కూడా.. అయితే టీమిండియా మాత్రం ఈ పద్ధతిని ఎప్పుడో మానేసింది...

Sachin Ganguly Sehwag
అంతర్జాతీయ క్రికెట్‌లో 24 వేలకు పైగా పరుగులు, 100 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్, పార్ట్ టైమ్ బౌలర్‌గా 200 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో రెండు సార్లు ఐదేసి వికెట్లు తీసిన సచిన్, ఓ మ్యాచ్‌లో బౌలింగ్ పర్ఫామెన్స్ కారణంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలవడం విశేషం...
సచిన్ టెండూల్కర్‌తో వన్డేల్లో ఓపెనింగ్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్, అంతర్జాతీయ క్రికెట్‌లో 16 వేలకు పైగా పరుగులు చేశాడు. టెస్టుల్లో రెండు త్రిబుల్ సెంచరీలతో కలిపి అంతర్జాతీయ కెరీర్‌లో 38 సెంచరీలు నమోదు చేశాడు. బౌలర్‌గానూ సత్తా చాటిన వీరేంద్ర సెహ్వాగ్, అంతర్జాతీయ కెరీర్‌లో 136 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఓ సారి ఐదు వికెట్లు తీసిన సెహ్వాగ్, వన్డేల్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు...
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఆల్‌రౌండర్‌గా రాణించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేలకు పైగా పరుగులు చేసిన సౌరవ్ గంగూలీ, వన్డేల్లో రెండు సార్లు ఐదేసి వికెట్లు తీశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 132 వికెట్లు తీసిన గంగూలీ, వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టాడు...
sachin ganguly rohit kohli
సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ కలిసి హర్భజన్ సింగ్ టెస్టు (417) వికెట్ల కంటే ఎక్కువ వికెట్లు తీశారు. అయితే వీరి తర్వాతి తరంలో ఇలా బ్యాటుతో రాణిస్తూ బౌలింగ్ చేసే ప్లేయర్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా నిరూపించుకున్న విరాట్ కోహ్లీ, తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటిదాకా వేసింది 793 బంతులే. అందులో 8 వికెట్లు తీశాడు కోహ్లీ...
అలాగే ఐపీఎల్‌లో హ్యాట్రిక్ తీసిన రోహిత్ శర్మ, అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం బౌలర్‌గా పెద్దగా ఉపయోగపడలేదు. టెస్టుల్లో 2, వన్డేల్లో 8, టీ20ల్లో ఓ వికెట్ తీసిన రోహిత్ శర్మ, ఓపెనర్‌గా మారిన తర్వాత బౌలింగ్ చేయడం పూర్తిగా మానేశాడు. .
KL Rahul
టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో పాటు అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా అయితే అసలు బౌలింగ్ జోలికే వెళ్లలేదు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ... సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడిన తర్వాత కూడా బౌలింగ్ చేయడానికి ఆసక్తి చూపించేవాళ్లు. ఇప్పుడు మాత్రం అలాంటి ఆసక్తి ప్లేయర్లలో కనిపించడం లేదు...
Rohit Sharma and KL Rahul
కేవలం బ్యాటింగ్ చేస్తే చాలు, తమ పనైపోయింది. చేతుల్లోకి బంతి వచ్చినప్పుడు క్యాచ్ అందుకుంటే చాలు... మిగిలిన పని బౌలర్లే చూసుకుంటారనే ధోరణి ప్లేయర్లలో పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే నేటి తరం ప్లేయర్లు సుఖానికి బాగా అలవాటు పడ్డారు. ఒక్క సిరీస్ ఆడితే తర్వాతి సిరీస్‌కి రెస్ట్ తీసుకుంటున్నారు...
బ్యాటింగ్ చేసిన తర్వాత మళ్లీ బౌలింగ్ చేయాలంటే తమ వల్ల కాని పని అంటూ చేతులు ఎత్తేస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్ కొనసాగించి 35+ వయసులో కూడా బ్యాటింగ్ చేసిన సచిన్, గంగూలీ, సెహ్వాగ్‌లకు నేటితరం కోహ్లీ, రోహిత్ శర్మ, రాహుల్‌లకు ఉన్న ప్రధానమైన తేడా ఇదే...