- Home
- Sports
- Cricket
- టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్‌ల వల్లే త్వరగా రిటైర్మెంట్ ఇచ్చా... పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు...
టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్‌ల వల్లే త్వరగా రిటైర్మెంట్ ఇచ్చా... పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు...
ఫాస్ట్ బౌలింగ్ ప్రపంచంలో షోయబ్ అక్తర్ లెజెండ్. క్రికెట్ వరల్డ్‌లో అత్యంత వేగవంతమైన డెలివరీని వేసిన షోయబ్ అక్తర్, తన కెరీర్ ఆసాంతం గాయాలతో సతమతమయ్యాడు. గాయాల కారణంగానే అక్తర్ అనుకున్నంత సక్సెస్‌ఫుల్‌గా సాగలేదు...

Shoaib Akhtar
14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 46 టెస్టులు, 163 వన్డేలు ఆడిన షోయబ్ అక్తర్, ఓవరాల్‌గా 415 వికెట్లు పడగొట్టాడు. 15 టీ20ల్లో 19 వికెట్లు తీశాడు...
‘నేను రిటైర్మెంట్ తీసుకోవడానికి ముఖ్య కారణం పొద్దునే లేవడం ఇష్టలేకనే. గత 25 ఏళ్లుగా ఉదయం 6 గంటలకే నిద్ర లేవాల్సి వస్తోంది...
ఆ తర్వాత సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ లాంటి క్రికెటర్లకు రోజంతా బౌలింగ్ చేయాలి. వాళ్లు రోజంతా ఆడి, నన్ను పూర్తిగా అలసిపోయేలా చేసేవాళ్లు...
ఓ రకంగా నేను త్వరగా రిటైర్ అవ్వడగానికి ఈ ఇద్దరే ప్రధాన కారణం. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా, ఏ తొందర లేకుండా నిద్రపోతున్నా...’ అంటూ కామెంట్ చేశాడు షోయబ్ అక్తర్...
షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో 56.40 సగటుతో పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, ఆరు టెస్టుల్లో రెండు సార్లు, వన్డేల్లో నాలుగు సార్లు అవుట్ అయ్యాడు...
కెరీర్ ఆరంభంలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్‌లను గోల్డెన్ డకౌట్ చేసిన షోయబ్ అక్తర్, ఆ మూమెంట్ తన కెరీర్‌లో బిగ్గెస్ట్ మూమెంట్‌గా చెబుతాడు...
‘సచిన్ టెండూల్కర్ కూడా నా బౌలింగ్ ఎదుర్కోవడానికి బాగా ఇబ్బందిపడేవాడు. ఆ మాటకొస్తే భారత జట్టులో అందరూ నా బౌలింగ్ ఫేస్ చేయడానికి భయపడేవాళ్లు.
కానీ ఒక్కడు... లక్ష్మీపతి బాలాజీ మాత్రం నా బౌలింగ్‌లో సిక్సర్లు బాదేవాడు. లోయర్ ఆర్డర్‌లో వచ్చి హిట్టింగ్ చేసేవాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్...
2004లో లాహోర్‌లో జరిగిన డిసైడర్ మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో లక్ష్మీపతి బాలాజీ బ్యాటు విరిగింది. అయితే అదే ఓవర్‌లో సిక్సర్ బాదిన బాలాజీ, ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి భారత జట్టుకి అద్భుత విజయం అందించాడు..