- Home
- Sports
- Cricket
- సచిన్ ‘మాస్టర్’ క్లాస్, యువరాజ్ ఊర మాస్ ‘సిక్సర్ల’ మోత... ఇండియా లెజెండ్స్ ఘన విజయం...
సచిన్ ‘మాస్టర్’ క్లాస్, యువరాజ్ ఊర మాస్ ‘సిక్సర్ల’ మోత... ఇండియా లెజెండ్స్ ఘన విజయం...
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ మ్యాచ్, భారత క్రికెట్ వెటరన్ జట్టును గుర్తుకు తెచ్చింది. సచిన్ టెండూల్కర్ తనదైన స్టైల్‌లో మాస్టర్ క్లాస్ చూపించగా, యువరాజ్ సింగ్ మరోసారి వరుస సిక్సర్లతో మోత మోగించాడు.

సౌతాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 204 పరుగుల భారీ స్కోరు చేసింది. వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్ 6 పరుగులకే అవుటైనా సచిన్ టెండూల్కర్, బద్రీనాథ్, యువరాజ్ సింగ్ కలిసి అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియా లెజెండ్స్‌కి భారీ స్కోరు అందించారు...

సచిన్ టెండూల్కర్ 37 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బ్రదీనాథ్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు...

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్, మునుపటి యువీని గుర్తుకు తెచ్చేలా వరుస సిక్సర్లు బాదాడు. డె బ్రూయిన్ వేసిన 18వ ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్ 22 బంతుల్లో 2 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..

యూసఫ్ పఠాన్ 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసి అవుట్ కాగా గోనీ 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు... 205 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఓపెనర్లు ఆండ్రూ పుటిక్ 41, మోర్నే వాన్ విక్ 48 పరుగులు చేశారు. తొలి వికెట్‌కి 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా ఓటమి పాలైంది.

యూసఫ్ పఠాన్ 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, యువరాజ్ సింగ్ 3 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఓజా, వినయ్ కుమార్‌లకు తలా ఓ వికెట్ దక్కింది... 56 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది టీమిండియా.