MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రికార్డుల వర్షం కురిపించిన రుతురాజ్ గైక్వాడ్... ముంబైపై చెన్నై టాప్ స్కోరర్‌గా...

రికార్డుల వర్షం కురిపించిన రుతురాజ్ గైక్వాడ్... ముంబైపై చెన్నై టాప్ స్కోరర్‌గా...

ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2లో మొదటి మ్యాచే క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత కిక్‌ని అందించింది. ఆరంభంలో వన్ సైడెడ్‌గా సాగుతున్నట్టు కనిపించిన మ్యాచ్‌‌ను మలుపుతిప్పి, సీఎస్‌కేలో స్టార్‌గా మారాడు రుతురాజ్ గైక్వాడ్... తన ఇన్నింగ్స్‌లో పలు రికార్డులను క్రియేట్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Sep 19 2021, 10:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌పై అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

ఇంతకుముందు మైక్ హుస్సీ 2013లో ముంబై ఇండియన్స్‌పై 58 బంతుల్లో 86 పరుగులు చేశాడు.. హుస్సీని అధిగమించిన రుతురాజ్ గైక్వాడ్, ముంబై వర్సెస్ చెన్నై మ్యాచుల్లో రెండో టాప్ స్కోరర్‌గానూ నిలిచాడు...

310

2008లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 48 బంతుల్లో 114 పరుగులు చేసిన సనత్ జయసూర్య మాత్రమే, రుతురాజ్ గైక్వాడ్ కంటే ముందున్నాడు... 

410

గత 14 మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలవడం రుతురాజ్ గైక్వాడ్‌కి ఇది ఐదోసారి. రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ కారణగా తొలి 11 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు మాత్రమే చేసిన సీఎస్‌కే, ఆ తర్వాత 9 ఓవర్లలో 108 పరుగులు రాబట్టగలిగింది...

510

యూఏఈలో జరిగిన 2020 ఐపీఎల్‌ ఆఖరి మూడు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన రుతురాజ్ గైక్వాడ్, అక్కడ వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ నమోదుచేయడం విశేషం...

610

ముంబై ఇండియన్స్ తరుపున పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా బుమ్రాతో కలిసి మూడో స్థానంలో నిలిచాడు ట్రెంట్ బౌల్డ్. లసిత్ మలింగ పవర్‌ప్లేలో 37 వికెట్లు తీయగా, మిచెల్ మెక్‌లగాన్ 31 వికెట్లు తీశాడు... బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ 20 వికెట్లు తీశారు...

710

టాప్ 3లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం, చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది మూడోసారి. ఇంతకుముందు 2008లో రాజస్థాన్ రాయల్స్‌పై, 2011లో పంజాబ్ కింగ్స్‌పై ఇలా ఇద్దరు సీఎస్‌కే టాపార్డర్ బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు.

810

తొలి మూడు ఓవర్లలో 3 వికెట్లు కోల్పోవడం సీఎస్‌కేకి ఐదోసారి. అందులో తొలిసారి 2008లో రాజస్థాన్ రాయల్స్‌పై ఇలా 3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోగా, ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌పై నాలుగు సార్లు ఈ చెత్త రికార్డు క్రియేట్ చేసింది..

910

ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత ఐదు మ్యాచుల్లో సురేష్ రైనా వరుసగా 2,5,8,2,4 పరుగులు చేసి డబుల్ డిజిట్ స్కోరు కూడా చేరుకోలేకపోగా... మహేంద్ర సింగ్ ధోనీ గత 3 ఇన్నింగ్స్‌లో ముంబైపై 19 పరుగులు మాత్రమే చేశాడు...

1010

ఐపీఎల్‌‌లో 73 వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్, లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్‌గా నిలిచాడు... ముంబై మాజీ బౌలర్, న్యూజిలాండ్ ప్లేయర్ మిచెల్ మెక్‌లాగన్ 71 ఐపీఎల్ వికెట్లు తీశాడు. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. ఉర్విల్‌ పటేల్‌ సునామీ ఇన్నింగ్స్ తో లక్నో ను దెబ్బకొట్టిన చెన్నై
Recommended image2
Vaibhav Sooryavanshi : సచిన్, కోహ్లీ వల్ల కాలేదు.. 15 ఏళ్ల కుర్రాడు వరల్డ్ రికార్డ్ కొట్టాడు!
Recommended image3
IND vs PAK: భారత్ vs పాకిస్థాన్ వరల్డ్ కప్ సమరానికి డేట్ ఫిక్స్.. దాయాదుల ఫైట్ మామూలుగా ఉండదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved