MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • RR vs RCB: జైపూర్ లో విరాట్-సాల్ట్ విధ్వంసం.. సంజూ శాంసన్ కు షాక్

RR vs RCB: జైపూర్ లో విరాట్-సాల్ట్ విధ్వంసం.. సంజూ శాంసన్ కు షాక్

IPL 2025 RR vs RCB: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు కొన‌సాగుతోంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను ఓడించి ఈ సీజ‌న్ లో నాలుగో విజయాన్ని సాధించింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ సూప‌ర్ నాక్ ల‌తో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఆర్ఆర్ పై ఆర్సీబీ ఈజీగానే గెలిచింది.   

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 13 2025, 08:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

RR vs RCB IPL 2025: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఉత్కంఠ‌గా సాగుతోంది. ఈ సీజ‌న్ లో విరాట్ కోహ్లీ టీమ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మంచి ట‌చ్ లో క‌నిపిస్తోంది. అదిరిపోయే ఆట‌తో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది.

ఈ క్ర‌మంలోనే ఐపీఎల్ 2025 28వ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో త‌ల‌ప‌డింది. రాజస్థాన్ రాయల్స్‌కు వారి సొంతగడ్డపై అద్భుత‌మైన ఆటతో షాక్ ఇచ్చింది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ సూప‌ర్ నాక్ ల‌తో 9 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Virat Kohli vs Sanju Samson

Virat Kohli vs Sanju Samson

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు యంగ్ ప్లేయ‌ర్ యశస్వి జైస్వాల్ మంచి ఆరంభం అందించాడు.

47 బంతుల్లో 2 సిక్సర్లు, 10 ఫోర్లతో 75 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. అయితే, కీల‌క స‌మ‌యంలో అత‌ను అవుట్ కావ‌డంతో ఆర్ఆర్ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 174 ప‌రుగులు చేసింది. రియాన్ పరాగ్ 30 ప‌రుగులు, ధ్రువ్ జురెల్ 35 ప‌రుగుల ఇన్నింగ్స్ ల‌ను ఆడారు.

35
Phil Salt and Virat Kohli

Phil Salt and Virat Kohli

175 పరుగుల టార్గెల్ తో బ్యాటింగ్ కు దిగిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు రాజ‌స్థాన్ టీమ్ ఏ స‌మ‌యంలోనూ ఛాలెంజ్ చేయ‌లేక‌పోయింది. దీంతో ఆర్సీబీ ఏకపక్ష విజ‌యాన్ని అందుకుంది.  రాజస్థాన్ నుంచి ఒకే ఒక్క బౌలర్ వికెట్ తీయగలిగాడు. ఇంపాక్ట్ ప్లేయర్ కుమార్ కార్తికేయ ఫిలిప్ సాల్ట్ తుఫాను ఇన్నింగ్స్‌కు బ్రేక్‌లు వేశాడు. సాల్ట్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 65 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అప్ప‌టికే మ్యాచ్ ఆర్సీబీ చేతిలోకి వెళ్లిపోయింది. 

45

ఫిల్ సాల్ట్ వికెట్ ప‌డిన త‌ర్వాత విరాట్ కోహ్లీ మ‌రోసారి అద్భుతంగా బ్యాటింగ్ తో మ్యాచ్ ను త్వ‌ర‌గా పూర్తి చేశాడు. కోహ్లీ 45 బంతుల్లో 62 పరుగులు చేసి మ్యాచ్ గెలిచే ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీకి తోడుగా దేవ‌ద‌త్ పడిక్క‌ల్ కూడా 40 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ తో ఆర్సీబీ 17.3 ఓవ‌ర్ల‌లోనే 175/1 ప‌రుగుల‌తో విజ‌యాన్నిఅందుకుంది. 

 

55

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ తో మ‌రో రికార్డు సాధించాడు. ఇది విరాట్ కోహ్లీకి 58వ ఐపీఎల్ హాఫ్ సెంచ‌రీ. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక 50+ స్కోర్‌ల రికార్డు సాధించిన‌ వార్నర్ రికార్డును సమం చేశాడు. అలాగే, త‌న టీ20 కెరీర్ లో 100వ హాఫ్ సెంచ‌రీ ఇది కావ‌డం విశేషం. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved