MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • Virat Kohli: తొలి ఏషియన్ ప్లేయ‌ర్.. టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ సూప‌ర్ రికార్డు

Virat Kohli: తొలి ఏషియన్ ప్లేయ‌ర్.. టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ సూప‌ర్ రికార్డు

Kohli completes 100 half-centuries in T20s: ఐపీఎల్ 2025 28వ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డింది. రాజస్థాన్ రాయల్స్‌కు వారి సొంతగడ్డపై ఆర్సీబీ బిగ్ షాక్ ఇచ్చింది. విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ సూప‌ర్ నాక్ ల‌తో 9 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మ‌రో అద్భుత‌మైన రికార్డును అందుకున్నాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 13 2025, 09:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Kohli completes 100 half centuries in T20s

Kohli completes 100 half-centuries in T20s

Kohli completes 100 half-centuries in T20s: ఐపీఎల్ 2025లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత‌మైన నాక్ తో అద‌ర‌గొట్టాడు. ఆర్ఆర్ బౌలింగ్ ను ఊతికిపారేస్తూ ఈ ఐపీఎల్ సీజ‌న్ లో వ‌రుస‌గా రెండో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. తన అద్భుతమైన కెరీర్‌లో మరో రికార్డును అందుకున్నాడు. టీ20 క్రికెట్ లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి ఏసియా ప్లేయర్ గా విరాట్ కోహ్లీ ఘ‌న‌త సాధించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Phil Salt and Virat Kohli

Phil Salt and Virat Kohli

జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 39 బంతుల్లోనే వానిందు హసరంగా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఈ సీజన్‌లో తన మూడో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.

విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ తుఫాను ఇన్నింగ్స్ తో 17.3 ఓవర్లలో కేవ‌లం ఒక వికెట్ మాత్ర‌మే కోల్పోయి 175/1 ప‌రుగుల‌తో ఆర్సీబీ విజ‌యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 62 ప‌రుగులు ఇన్నింగ్స్ ను ఆడాడు. దీంతో విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో 58వ హాఫ్ సెంచ‌రీని పూర్తి చేశాడు.

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డును కూాడా సమం చేశాడు. అలాగే, టీ20 క్రికెట్‌లో 100 హాఫ్ సెంచరీలు సాధించిన ప్లేయర్ గా కూడా వార్నర్ తర్వాత కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. 

34

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అలాగే, క్రిస్ గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, కీరాన్ పొలార్డ్ తర్వాత ఈ ఘనత సాధించిన 5వ ప్లేయర్ గా నిలిచాడు. 

విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో 258 మ్యాచ్ లు ఆడి 132 స్ట్రైక్ రేటుతో 8252 ప‌రుగులు కొట్టాడు. ఇందులో 58 హాఫ్ సెంచ‌రీలు, 8 సెంచ‌రీలు ఉన్నాయి.

44

కింగ్ కోహ్లీ భార‌త్ తరపున 125 టీ20లు ఆడి 4188 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. గ‌తేడాది జూన్ 29న దక్షిణాఫ్రికాతో జరిగిన T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో భార‌త్ విజ‌యం సాధించిన త‌ర్వాత కోహ్లీ త‌న టీ20 క్రికెట్ అంత‌ర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు ప‌లికాడు. టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో 59 బంతుల్లో 76 పరుగుల నాక్ తో కింగ్ కోహ్లీ భార‌త్ ట్రోఫీని గెలుచుకోవ‌డంతో కీల‌కంగా ఉన్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image2
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image3
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved