- Home
- Sports
- Cricket
- Rohit Sharma: మ్యాచులు గెలవట్లేదుగా.. ఇంకెందుకు.. దిగిపోతే బెటర్ : ముంబై సారథి పై మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma: మ్యాచులు గెలవట్లేదుగా.. ఇంకెందుకు.. దిగిపోతే బెటర్ : ముంబై సారథి పై మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్
TATA IPL 2022: ఈ సీజన్ లో వరుసగా నాలుగు మ్యాచులు ఓడి బుధవారం పంజాబ్ కింగ్స్ తో కీలక మ్యాచ్ తలపడుతున్న ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టు, నాయకుడిగా పేరు సంపాదించిన రోహిత్ శర్మ ఈ సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. 2022 సీజన్ లో వరుసగా నాలుగు మ్యాచులు ఓడింది రోహిత్ సేన.
సారథిగానే గాక హిట్ మ్యాన్ బ్యాటర్ గా కూడా పెద్దగా రాణించడం లేదు. గతంలో ముంబైకి ఒంటి చేత్తో విజయాలు అందించిన రోహిత్.. ఈ సీజన్ లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.
ఇక ట్రోఫీ రేసులో నిలవాలంటే బుధవారం తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఎదుర్కోబోతున్నది ముంబై ఇండియన్స్. పంజాబ్ కింగ్స్ తో బుధవారం రాత్రి ముంబై తలపడనున్నది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. రోహిత్ శర్మపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ ఇక సారథిగా దిగిపోతే బెటరని సూచిస్తున్నాడు.
ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ మాట్లాడుతూ... ‘గత మూడు నాలుగు సీజన్లుగా రోహిత్ శర్మ బ్యాటింగ్ సగటు 30 కంటే తక్కువగా ఉంది. ఇక స్ట్రైక్ రేట్ 150-160 మధ్యే ఉంది.
ఇండియాకు ఆడేప్పుడు రోహిత్ స్వేచ్ఛగా ఆడతాడు. అప్పుడు (రోహిత్ కెప్టెన్ కాకముందు) అతడి మీద కెప్టెన్సీ భారం లేదు. కానీ ముంబై తరఫున ఆడుతున్నప్పుడు రోహిత్ కు తన బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీ కూడా ఉంది. రెండింటినీ అతడు మేనేజ్ చేయలేకపోతున్నాడు.
అది అతడి బ్యాటింగ్ మీద కూడా ప్రభావం చూపుతున్నది. కానీ అతడు ఆ భారాన్ని వదిలితే భారత్ తరఫున ఆడే రోహిత్ శర్మ ఆటను ఐపీఎల్ లో చూడొచ్చు.
దానికి అతడు ఐపీఎల్ కెప్టెన్సీ వదిలేయాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లి తాను కెప్టెన్సీనుంచి వైదొలిగినట్టు.. హిట్ మ్యాన్ కూడా వాటిని వదిలేయాలి. అప్పుడే అతడు పూర్తి స్వేచ్ఛగా ఆడగలుగుతాడు. కెప్టెన్సీ పగ్గాలను జట్టులో సీనియర్ ఆటగాడైన కీరన్ పొలార్డ్ కు అప్పగించాలి..’అని మంజ్రేకర్ చెప్పాడు.