- Home
- Sports
- Cricket
- ఇంగ్లాండ్ టూర్‌లో ఆ ఇద్దరూ కలిసి ఇరగదీస్తే... విరాట్ కోహ్లీ - రోహిత్ జోడిని ఊరిస్తున్న రేర్ రికార్డు...
ఇంగ్లాండ్ టూర్‌లో ఆ ఇద్దరూ కలిసి ఇరగదీస్తే... విరాట్ కోహ్లీ - రోహిత్ జోడిని ఊరిస్తున్న రేర్ రికార్డు...
సచిన్ టెండూల్కర్ - వీరేంద్ర సెహ్వాగ్, టెండూల్కర్ - సౌరవ్ గంగూలీ తర్వాత ఆ రేంజ్‌లో సక్సెస్ సాధించిన జోడీ రోహిత్ శర్మ - విరాట్ కోహ్లీ జోడి. ఈ కెప్టెన్, మాజీ కెప్టెన్ జోడీ ఇంగ్లాండ్ టూర్‌లో ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నారు...

వన్డేల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి 4906 పరుగులు జోడించారు. ఈ ఇద్దరి యావరేజ్ 56.04. టీమిండియా చరిత్రలో అత్యధిక సగటుతో 4 వేలకు పైగా పరుగులు జోడించిన జోడీ రోహిత్- విరాట్ కోహ్లీలే...
ఈ ఇద్దరూ మరో 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే ఈ తరంలో వన్డేల్లో 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. మరో 133 పరుగులు చేస్తే రోహిత్ శర్మ - శిఖర్ ధావన్ కలిసి నెలకొల్పిన 5039 పరుగుల రికార్డును కూడా అధిగమించి... అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన టాప్ 7 జోడీగా నిలుస్తారు.
టీ20ల్లో రోహిత్ శర్మ - విరాట్ కోహ్లీ కలిసి ఇప్పటిదాకా 991 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మరో 9 పరుగులు చేస్తే టీ20ల్లో 1000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటుంది విరాట్ - రోహిత్ జోడీ...
అలాగే టెస్టుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి 940 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరూ మరో 60 పరుగులు జోడిస్తే 1000 పరుగులు పూర్తి చేసుకుంటారు...
టెస్టుల్లో, టీ20ల్లో 1000 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకుంటే, మూడు ఫార్మాట్లలో వెయ్యికి పైగా భాగస్వామ్యం నెలకొల్పిన మొట్టమొదటి జోడిగా సరికొత్త రికార్డు నెలకొల్పుతారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ...
ఇంతవరకూ ఏ జోడీ కూడా మూడు ఫార్మాట్లలో 1000కి పైగా పరుగులు జోడించలేదు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ, మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ కలిసి భాగస్వామ్యం నెలకొల్పితే... భారత జట్టును ఎవ్వరూ ఆపలేరని అంటున్నారు ఫ్యాన్స్..