MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇది ఛీటింగ్, వికెట్లను పూర్తిగా మిస్ అవుతుంటే, అంపైర్ కాల్ ఎలా ఇస్తారు?... రోహిత్ అవుట్ విషయంలో...

ఇది ఛీటింగ్, వికెట్లను పూర్తిగా మిస్ అవుతుంటే, అంపైర్ కాల్ ఎలా ఇస్తారు?... రోహిత్ అవుట్ విషయంలో...

అంపైర్స్ కాల్... ఈ నిర్ణయం గురించి ఎన్నో రోజులుగా క్రికెట్ ప్రపంచంలో హాట్ డిస్కర్షన్ నడుస్తోంది. ఆస్ట్రేలియా టూర్‌ల అంపైర్స్ కాల్ నిర్ణయాలు, టీమిండియాకి వ్యతిరేకంగా రావడంతో దీన్ని తొలగించాలంటూ సచిన్ టెండూల్కర్ కూడా డిమాండ్ చేశాడు. ఇప్పుడు మరోసారి రోహిత్ శర్మ అవుట్ విషయంలో ఇచ్చిన నిర్ణయంపై పెద్ద చర్చ మొదలైంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Aug 27 2021, 10:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కి భారీ ఆధిక్యం ఇచ్చి, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను కాపాడేందుకు తనవంతు బాధ్యత తీసుకున్న రోహిత్ శర్మ, ఎంతో జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

156 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారాతో కలిసి రెండో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి అవుట్ అయ్యాడు.

37

రాబిన్‌సన్ బౌలింగ్‌లో షాట్ మిస్ అయిన రోహిత్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యినట్టు ప్రకటించాడు అంపైర్. వెంటనే డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకున్నాడు రోహిత్ శర్మ...

47

రిప్లైలో బంతి, వికెట్లను మిస్ అవుతున్నట్టుగా స్పష్టంగా కనిపించింది. అయితే అంపైర్ కాల్స్‌గా నిర్ణయించిన థర్డ్ అంపైర్, ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్నే ఫైనల్‌గా ప్రకటించాడు. దీనిపై దుమారం రేగింది...

57

అంపైర్స్ కాల్ అంటే బంతి, వికెట్లను కనీసం ఎడ్జ్‌లో అయినా తాకాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఊహాత్మకంగా బంతి గమనాన్ని అంచనా వేసే టెక్నాలజీ కంటే ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి విలువనిచ్చి... అంపైర్ కాల్‌గా ప్రకటిస్తారు.

67

అయితే వికెట్ల అంచును కూడా తాకనప్పుడు అంపైర్ కాల్‌గా ఎందుకు ప్రకటించారంటూ... ఇంగ్లాండ్ జట్టు సిరీస్ సమం చేసేందుకు ఛీటింగ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోల్స్ మొదలయ్యాయి...

77

అంతకుముందు జో రూట్ డీఆర్‌ఎస్ తీసుకోవడానికి లేట్ చేయడంలో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ, కాస్త ఆలస్యంగానైనా ఇలా అవుట్ అయ్యాడని, ఇందులో ఛీటింగ్ ఏముందని అంటున్నారు ఇంగ్లాండ్ ఫ్యాన్స్...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన వెంటనే కోహ్లీ టీమ్ లెజెండ్ సడన్ రిటైర్మెంట్.. అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
India T20 captain: వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌పై బీసీసీఐ వేటు ! టీమిండియా కొత్త కెప్టెన్ ఇతనేనా?
Recommended image3
Team India Captain : సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్ ఔట్... టీమిండియా కెప్టెన్ ఇతడే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved