సచిన్ టెండూల్కర్ కు షాకిచ్చిన రోహిత్ శర్మ
Rohit sharma surpasses Sachin Tendulkar: ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో (119 పరుగులు) అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్ తో ఫామ్ లోకి రావడమే కాకుండా, కటక్‌లో భారత్ కు సూపర్ విక్టరీ అందించాడు. అలాగే ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ రికార్డులను కూడా బ్రేక్ చేశాడు.

ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు. ఈ సెంచరీతో అతను వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినవారిలో టాప్ 10లోకి ప్రవేశించాడు.
కటక్‌లో రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. హిట్‌మ్యాన్ ఇటీవల పరుగులు చేయడానికి పడుతున్న ఇబ్బందిని తొలగించుకుని 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ (119 పరుగులు) కొట్టాడు. ఈ సమయంలో అతని అతని స్ట్రైక్ రేట్ 132.22గా ఉంది.
వన్డేల్లో అత్యధిక పరుగులు-టాప్ 10లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ
267 వన్డేల్లో, రోహిత్ 49.26 సగటుతో, 92.70 స్ట్రైక్ రేట్ తో 10,987 పరుగులు చేశాడు. అతనికి 32 సెంచరీలు, 57 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 264 పరుగులు. అతను వన్డేల్లో 10వ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఈ విషయంలో ద్రవిడ్ ను దాటేశాడు. ద్రవిడ్ 344 మ్యాచ్‌లలో 39.16 సగటుతో 10,889 పరుగులు చేశాడు. అతనికి 12 సెంచరీలు, 83 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా భారత్ తరపున రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్‌ను రోహిత్ అధిగమించాడు. 343 మ్యాచ్‌లలో, అతను 45.43 సగటుతో 15,404 పరుగులు చేశాడు. అతనికి 44 సెంచరీలు, 79 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 264 పరుగులు.
భారత ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరు?
సచిన్ టెండూల్కర్ 346 మ్యాచ్‌లలో 48.07 సగటుతో 15,335 పరుగులు చేశాడు. అతనికి 45 సెంచరీలు, 75 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 200* పరుగులు. ఓపెనర్‌గా భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు భారత ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. అతను 321 మ్యాచ్‌లలో 41.90 సగటుతో 15,758 పరుగులు చేశాడు. అతనికి 36 సెంచరీలు, 65 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 319 పరుగులు.
వివ్ రిచర్డ్స్ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ
కటక్‌లో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల విజయం రోహిత్ కెప్టెన్‌గా 36వ వన్డే విజయం దక్కించుకున్నాడు రోహిత్. వన్డేల్లో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన వారిలో అతను ఇప్పుడు వివ్ రిచర్డ్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. క్లైవ్ లాయిడ్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీలు 39 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నారు.
పురుషుల వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలు కొట్టడానికి రోహిత్ దగ్గరయ్యాడు. రోహిత్ తన 119 పరుగుల ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు బాదాడు. దీంతో క్రిస్ గేల్ (331) రికార్డును అధిగమించాడు. రోహిత్ 338 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అఫ్రిది 351 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
జడేజా అదరగొట్టాడు
ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జో రూట్ (72 బంతుల్లో 69 పరుగులు), బెన్ డకెట్ (56 బంతుల్లో 65 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. లియామ్ లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 41 పరుగులు), జోస్ బట్లర్ (35 బంతుల్లో 34 పరుగులు) కూడా రాణించారు. ఇంగ్లాండ్ 304 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా అదరగొట్టాడు. జడేజా మూడు వికెట్లు తీసుకున్నాడు.
రోహిత్, గిల్ దుమ్ములేపారు
రోహిత్ శర్మ (90 బంతుల్లో 119 పరుగులు), శుభ్‌మన్ గిల్ (52 బంతుల్లో 60 పరుగులు) 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శ్రేయాస్ అయ్యర్ (47 బంతుల్లో 44 పరుగులు), అక్షర్ పటేల్ (43 బంతుల్లో 41 పరుగులు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో ఇంగ్లాండ్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ రెండు వికెట్లు తీసుకున్నాడు.