MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ధోనీ అడుగుజాడల్లోనే రోహిత్ శర్మ... ఆ విషయంలో హిట్ మ్యాన్ సూపర్ సక్సెస్...

ధోనీ అడుగుజాడల్లోనే రోహిత్ శర్మ... ఆ విషయంలో హిట్ మ్యాన్ సూపర్ సక్సెస్...

టీమిండియా మైలురాయి 1000వ వన్డే మ్యాచ్‌లో కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్నాడు రోహిత్ శర్మ. విండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో రోహిత్ శర్మ తన కెప్టెన్సీ స్కిల్స్‌తో ఓ వర్గాన్ని ఇంప్రెస్ చేశాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 06 2022, 05:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో ఎంత సక్సెస్ అయినా, డీఆర్‌ఎస్ తీసుకునే విషయంలో మాత్రం అతనికి చెప్పుకోదగ్గ రికార్డు లేదు...

28

బౌలర్ అవుట్ అంటూ అప్పీలు చేస్తే చాలు, మరో ఆలోచన లేకుండా డీఆర్‌ఎస్ తీసుకునేవాడు విరాట్ కోహ్లీ... అందుకే చాలాసార్లు డీఆర్‌ఎస్ నిర్ణయాలు, టీమిండియాకి వ్యతిరేకంగా వచ్చేవి...

38

కొన్నిసార్లు డీఆర్‌ఎస్ తీసుకోవద్దని వికెట్ కీపర్ రిషబ్ పంత్ వారించినా, బౌలర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడనే ఉద్దేశంతో రివ్యూ తీసుకునేవాడు విరాట్ కోహ్లీ...

48

అయితే రోహిత్ శర్మ మాత్రం అలా చేయడం లేదు. చాలా కూల్‌గా, కామ్‌గా బౌలర్, వికెట్ కీపర్‌తో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కూడా చర్చించి డీఆర్‌ఎస్ తీసుకున్నాడు రోహిత్ శర్మ...

58

విండీస్‌తో మొదటి వన్డేలో రోహిత్ శర్మ తీసుకున్న మూడు డీఆర్‌ఎస్ నిర్ణయాలు, భారత జట్టుకి అనుకూలంగా వచ్చి, కీలక సమయాల్లో వికెట్లు తెచ్చిపెట్టాయి...

68

నికోలస్ పూరన్ అవుట్ విషయంలో, ఆ తర్వాత అకీల్ హస్సేన్ వికెట్ విషయంలో విరాట్ కోహ్లీ బ్యాటుకి తగిలిందని చెప్పడం, రోహిత్ రివ్యూ తీసుకోవడం... రిప్లైలో వికెట్ దక్కడం జరిగిపోయాయి...

78

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి డీఆర్‌ఎస్ తీసుకోవడంలో మంచి రికార్డు ఉంది. ధోనీ డీఆర్‌ఎస్ కోరాడంటే, అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందేనని నమ్ముతారు మాహీ ఫ్యాన్స్...

88

అందుకే డీఆర్‌ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్ కాదు, ధోనీ రివ్యూ సిస్టమ్ అని కొత్త అర్థం కూడా చెబుతారు. ఈ విషయంలో మాత్రం ఎమ్మెస్ ధోనీ అడుగుజాడల్లో రోహిత్ శర్మ నడుస్తున్నాడంటూ అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
ఎం.ఎస్. ధోని
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Finn Allen : ఇదెక్కడి మాస్ హిట్టింగ్ సామీ ! 303 స్ట్రైక్ రేట్ తో సెంచరీ
Recommended image2
SA vs NZ : ఫిన్ అలెన్ ఊచకోత.. సౌతాఫ్రికా ఖతం ! ఫైనల్లో కివీస్ రికార్డుల వేట
Recommended image3
SA vs NZ : టిమ్ సీఫెర్ట్ మాస్ బ్యాటింగ్.. ప్రోటీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన కివీస్ కుర్రాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved